thesakshi.com : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డొక్కిపర్రు శ్రీ భూసమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రీదేవి, భూదేవి, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు.
ఈ పుష్పయాగంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పురిటిపాటి వెంకట కృష్ణా రెడ్డి, ఆయన భార్య సుధ, పి వీరారెడ్డి, ఆయన భార్య విజయలక్ష్మితో పాటు కొమ్మారెడ్డి బాపిరెడ్డి విజయభాస్కరమ్మ, నాగిరెడ్డి, ఆయన భార్య ప్రసన్న పాల్గొన్నారు.
పుష్పయాగంలో దాదాపు ఐదు టన్నుల వివిధ రకాల పూలను ఉపయోగించారు. పుష్పయాగానికి ముందు 108 కలశంతో అభిషేకం, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
పుష్పయాగంలో పాల్గొన్న మహిళలకు ఐశ్వర్యం చేకూరుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బాలాజీ ప్రధాన ఆలయం వరకు పూలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. యాగంలో భాగంగా సుదర్శన హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.