THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Reviews

ఉత్కంఠ రేపే ‘రావణలంక’ మూవీ రివ్యూ

thesakshiadmin by thesakshiadmin
November 19, 2021
in Reviews
0
ఉత్కంఠ రేపే ‘రావణలంక’ మూవీ రివ్యూ
0
SHARES
29
VIEWS
Share on FacebookShare on Twitter

దర్శకుడు: బీఎస్‌ఎన్‌ రాజు
నటీనటులు: క్రిష్‌ బండిపల్లి, అష్మిత కౌర్‌ బక్షి, మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌, అష్రియా అర్షి
నిర్మాత: క్రిష్‌ బండిపల్లి
సంగీతం: ఉజ్జల్‌ కుమార్‌ సాహ

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లకు పండుగ రోజే. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. టాకీస్‌లోకి సినిమాల విడుదల మొదలైంది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘రావణలంక’. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్‌లలో విడుదలైంది. ఈ చిత్రంతో సినీ పరిశ్రమకు మరికొంతమంది ప్రతిభ గలవారు పరిచయమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆసక్తి రేపింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం

కథ: నలుగురు మిత్రులు కలిసి సరదాగా గోవాకు వెళ్తారు. అక్కడ ఎంజాయ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా వారిలో ఒకరు అనుమానాస్పద స్థితిలో శవమైపోతాడు. ఆ నేరం తమపై ఎక్కడ వస్తుందోనని భయంతో ఉంటారు. ఈ సమయంలో విఘ్నేశ్‌ (క్రిష్‌ బండిపల్లి) ప్రేయసి శ్రావణి (అష్మిత కౌర్‌) అదృశ్యమవుతుంది. శ్రావణి ఎక్కడికి పోయింది? ఆమె ఆచూకీ కోసం విఘ్నేశ్‌ ఏం చేశాడు? వీటి మధ్యలో డ్రగ్స్‌ వ్యవహారం ఏమిటి? అనేవి ఆసక్తికరం. కథలో ముఖ్యమైనది అసలు గోవాలో ఏం జరిగిందనేది ‘రావణలంక’ టైటిల్ ఎందుకు పెట్టారనేది తెలుస్తుంది.

ఎలా ఉందంటే: క్రైమ్‌ థిల్లర్‌ను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. శృతిమించి ప్రవరిస్తే యువత ఎంజాయ్‌మెంట్‌ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. బీఎస్‌ఎన్‌ రాజు దర్శకత్వ బాధ్యతలకు న్యాయం చేశాడు. ఎక్కడా కూడా కొత్త దర్శకుడి సినిమా మాదిరి అనిపించదు. డ్రగ్స్‌, అమ్మాయిల సరఫరా వంటి అంశాలను స్పృశిస్తూనే ప్రస్తుత సమాజ ధోరణిని వివరించాడు. ఇంకాస్త మెరుగుపరిస్తే దర్శకుడిగా రాజు నిలదొక్కుకోవచ్చు. నిర్మాణపరంగా ఉన్నతంగా ఉంది. క్రిష్‌ ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదని సినిమాను చూస్తే అర్థం అవుతుంది. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ విషయంలో కొంత ఇబ్బందిగా ఉంది.

ఎలా చేశారంటే: క్రైమ్‌ థిల్లర్‌ను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. నిర్మాతగాను వ్యవహరించిన హీరో క్రిష్‌ రెండు బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నటన.. ఫైట్స్‌లో రెచ్చిపోయాడు. శ్రావణి పాత్రలో మెరిసిన అష్మిత కౌర్‌ సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేలా ఉంది. నిర్మాణపరంగా ఉన్నతంగా ఉంది. కొత్త సినిమా అయినా ప్రముఖ నటులు మురళీ శర్మ, ‘మగధీర’ ఫేమ్‌ దేవ్‌గిల్‌ పోలీస్‌ పాత్రల్లో మెరిశారు. వారి నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తమ పాత్రకు పూర్తి న్యాయం చేసి సినిమాను ఒక మెట్టు ఎక్కించారు. రచ్చ రవి ఎపిసోడ్‌ ప్రేక్షకులను నవ్వులు తెప్పిస్తాయి. ఉజ్జల్‌ కుమార్‌ సంగీతం చిత్రానికి ప్లస్సయ్యింది. ముఖ్యంగా ‘అరెరె అరెరె’ అనే పాట అందరూ పాడుకునే మెలోడిగా ఉంది. ఈ పాట స్క్రీన్‌పై నేత్రానందం కలిగిస్తున్నది. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ‘సృజన ఇన్నవా’ అనే పాట ఊరమాస్‌గా ఉంది. రొమాన్స్‌తోపాటు థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాకు ఎంచక్కా వెళ్లొచ్చు.

రేటింగ్‌: 3/5

Tags: Ravana Lanka review
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info