thesakshi.com : ఇష్టం అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ఎప్పడో రెండు దశాబ్దాల క్రితం పరిచయం అయిన శ్రియ ఇప్పటికి కూడా నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువగా ఉంటూ తన అందంతో ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తూ వచ్చింది. ఈ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులను కాకుండా తమిళం.. హిందీ.. కన్నడం మరియు ఇంగ్లీష్ సినిమాల ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేసింది.
దేశ వ్యాప్తంగా స్టార్ హీరోయిన్ క్రేజ్ ను దక్కించుకున్న శ్రియ ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. తల్లిగా మారినా.. భార్యగా ఉన్నా కూడా తన అందాల విందు మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మడి జోరు తగ్గలేదు సరి కదా పెరిగింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన సమయంలో సోషల్ మీడియాలో హడావుడి చేయడం మొదలు పెట్టింది.
సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావుడి చేసిన ఈ అమ్మడు మళ్లీ మళ్లీ హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేసి జనాలకు మరింతగా చేరువ అవుతోంది. ఇటీవలే తల్లిగా అయిన శ్రియ అతి తక్కువ సమయంలోనే పూర్వపు రూపంకు వచ్చేసింది.
ఈమద్య కాలంలో మళ్లీ తన అందాల విందు ను కొనసాగిస్తుంది. తాజాగా సముద్రంలో ఇలా సందడి చేస్తూ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కూతురు తో ఆట ఆడుకుంటూ తన అభిమానులకు ఇలా అందాలను చూపించడం కేవలం ఆమెకు మాత్రమే చెల్లింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు మరియు వీడియో లు వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే సముద్రపు ఒడ్డున కూతురు తో కలిసి సరదాగా ఆడుకుంటూ అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్ కూడా వైరల్ అవుతోంది. అయితే కూతురు తో ఇలాంటి కెమెరా ఫోజులు ఏంటీ అంటూ కొందరు విమర్శిస్తుంటే మరి కొందరు ఫోటోలకు లవ్ ఈమోజీలు కామెంట్ చేస్తున్నారు.