THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్

thesakshiadmin by thesakshiadmin
October 15, 2021
in Latest, Movies
0
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పూరి-సల్మాన్ మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ కాంబినేషన్ లో చిత్రం రాబోతుందని ప్రచారం సాగుతోంది. తాజాగా ఆ ప్రచార నిజమనిపించేలా మరో వార్త బయటకు వచ్చింది. ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చిందిట. సల్మాన్ ఖాన్ ని స్క్రిప్ట్ తో ఒప్పిస్తే తామే సినిమా నిర్మాణానికి ఎంత బడ్జెట్ అయినా ఖర్చు చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చిందిట. ఈ నేపథ్యంలోనే పూరి తనదైన మార్క్ స్క్రిప్ట్ తో సల్మాన్ ని లాక్ చేసినట్లు సమాచారం.

గతంలో పూరి తెరకెక్కించిన కొన్ని సినిమాల్ని సల్మాన్ ఖాన్ హీరోగా హీందీలో రీమేక్ చేయగా అక్కడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. పూరి `పోకిరి`ని ప్రభుదేవా `వాంటెడ్` టైటిల్ తో రీమేక్ చేయగా సల్మాన్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. పూరి స్క్రిప్టు పై నమ్మకంతో సల్మాన్ ఖాన్ కూడా లైన్ విన్న వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఏదేమైనా ఈ కలయిక క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఓ పెద్ద స్టార్..మరో పెద్ద దర్శకుడు..అగ్ర నిర్మాణ సంస్థ ఇవన్నీ కలిస్తే పాన్ ఇండియా సినిమా అవుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కాంబినేషన్ గనుక నిజమైతే ఎన్ని భాషల్లో తెరకెక్కుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పూరి బిగ్ బి అమితాబ్ బబ్చన్ `బుడ్డా` చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు.

కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అంతగా రాణించలేదు. తాజాగా పూరి మరోసారి బాలీవుడ్ లో ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథనాయకుడిగా `లైగర్` చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ముంబైలోనే జరిగింది. ఈ నేపథ్యంలో పూరి ఎక్కువగా ముంబైలోని ఉంటున్నారు. దీనిలో భాగంగా సల్మాన్ ఖాన్ కి కూడా ఓ సారి టచ్ లోకి వెళ్లి లాక్ చేసినట్లు కనిపిస్తోంది.

Tags: #BOLLYWOOD MOVIE#FILM NEWS#Puri Jagannadh#SALMAN KHAN
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info