thesakshicom : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు లంకేష్ గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో సీత పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినప్పటికీ ఇతర ప్రధాన పాత్రలపై క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో సీత పాత్రలో నటించే హీరోయిన్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.
ఇప్పటివరకు అందరూ అనుకుంటున్నట్లే ‘ఆదిపురుష్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నే హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుందని అంటున్నారు. కాగా భారీ బడ్జెట్ తో 3డి గ్రాఫిక్స్ లో ఒక విజువల్ వండర్ లా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ మలయాళ కన్నడ భాషలలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.