thesakshi.com : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న రన్ హోలా ప్రాంతానికి చెందిన వీర బహదూర్ వర్మ అనే వ్యక్తకి 50 ఏళ్లు. అతనికి ఇద్దరు భార్యలు. అతను బిజినెస్ చేసుకుంటూ తన కుటుంబాలను పోషిస్తున్నాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆస్తికోసం కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో మొదటి భార్య తన పిల్లలతో కలిసి నాంగ్లోయ్ ప్రాంతంలో ఉంటుంది. అయితే, వీరబహదూర్ వర్మ, రెండో భార్య చందా దేవితో కలిసి రన్ హోలా లోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో వీరబహదూర్ వర్మ తన గదిలో రక్తపు మడుగులో ఉండటం ఆమె చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత మొదటి భార్యకు కూడా సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మొదటి భార్య ఆస్తి కోసమే రెండో భార్య వీర బహదూర్ ను హతమార్చిందని ఆరోపించింది. అయితే, చందాదేవి మరో విధంగా ఉంది.
తన ఇంట్లో దొంగలుపడ్డారని డబ్బుల కోసం తన భర్తను దాడిచేసి హతమార్చారని చెప్పింది. దీని వెనుక మొదటి భార్య , ఆమె పిల్లల హస్తం ఉందని చెప్పింది. కాగా, పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనుమానస్పదంగా చనిపొయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.