thesakshi.com : తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు 475 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం రాత్రి విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై అధికారులు బుధవారం సాయంత్రం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
అతని ప్యాంటు లోపలి భాగంలో ప్రత్యేకంగా అమర్చిన జేబులో దాదాపు 475 గ్రాముల బంగారం. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. 24.8 లక్షలు.
ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.