thesakshi.com : ప్రస్తుతం ఓ రెండు ఫోటోలు జాయింట్ చేసి సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అయితే ఆ రెండు ఫోటోలలో ఎవరున్నారు? అంటే.. ఒకటి తారక్ ఫోటో.. రెండోది ఆలియా ఫోటో. అందమైన జంట కలిసి నటిస్తే ఎంత బావుంటుందోనంటూ ఎంతో ముచ్చటపడుతున్నారు. అందుకు కొరటాల శివ అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఇంతలోనే తారక్ అభిమానులు షాకింగ్ న్యూస్ వినాల్సొచ్చింది.
అందాల ఆలియాభట్ తాను కోరుకున్న వాడిని పెళ్లాడేస్తుండడమే ఆ షాకింగ్ న్యూస్. ఈ వారంలోనే రణబీర్ కపూర్ తో పెళ్లి. అందువల్ల తారక్ తో సినిమా చేస్తుందా లేదా? అంటూ ఆందోళన మొదలైంది. ఉన్నట్టుండి ఊహించని పిడుగులా ఆలియా భట్ పెళ్లి కబురు అందింది. దీంతో అంతా ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఆలియా ఉంటే పాన్ ఇండియా మార్కెట్ కొల్లగొట్టినట్టే అనుకున్న ఎన్టీఆర్ టీమ్ అలాగే అభిమానులకు కూడా ఇది ఊహించని షాక్.
ఎన్టీఆర్ 30లో అలియా భట్ కథానాయికగా నటిస్తుందని అంతా ఫిక్సయిపోయి ఉండగా ఈ షాక్ లు తప్పడం లేదు. RRR లో చరణ్ సరసన నటించిన ఆలియా తారక్ తోనూ నటించేందుక ఆసక్తిని కనబరిచింది. కానీ ఇంతలోనే పెళ్లికి సిద్ధమైంది. ఈ నెల మూడో వారంలో తన చిరకాల ప్రియుడు.. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో ఆలియా వివాహం జరగనుంది.
ఈ జంట సుదీర్ఘ హనీమూన్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాలని భావిస్తున్నారు. ఆలియా వివాహం.. తదుపరి హనీమూన్ అంటూ చిలౌట్ మోడ్ లోకి వెళ్లిపోతే.. ఎన్టీఆర్ 30ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందోనని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆలియా పెళ్లి చేసుకున్న వెంటనే హనీమూన్ సహా ఇతర వివాహ వేడుకలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం నెలల సమయం పడుతుంది.
ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్ 30 మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ప్రాజెక్ట్ షూట్ ప్రారంభించడానికి ఇప్పటికే చాలా కాలం పాటు వేచి ఉంది టీమ్. ఇప్పుడు చివరి విషయం అలియా ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదన్న ఆందోళన కనిపిస్తోంది.
అయితే ఆలియా పెళ్లితో ఓ ఇంటిదైనా కానీ కమిట్ మెంట్ ప్రకారం నటించి వెళుతుందన్న భరోసా ఉంది. తను పూర్తిగా వృత్తికి అంకితమయ్యే నిబద్ధత కలిగిన గొప్ప నటి. అందుకే ఇంత పెద్ద స్థాయికి ఎదగగలిగింది. ఇక పెళ్లితో ఒక ఇంటిదైతే అందరికీ సంతోషమే. కానీ పెళ్లి తర్వాత సౌకర్యంగా తిరిగి తన పనిని తాను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.