thesakshi.com : కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ.. మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతిచెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్ ఫైర్ జరిగి మృతిచెందారా? అనేది తేలనుంది.
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు వున్న యువత బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ గోపాల కృష్ణ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న సీఎం బందోబస్తు కి వెళ్ళి వచ్చిన ఎస్ ఐ గోపాలకృష్ణ రాత్రి ఇంట్లో గన్ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణది విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు సొంత ఊరు. 2014 సంవత్సరం బ్యాచ్ లో ఎస్ఐగా సెలక్ట్ అయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏమై వుంటాయా అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.గతంలో కాకినాడలో ట్రాఫిక్ లో పని చేశారు గోపాల కృష్ణ. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై ఇంటికి చేరుకుంటున్నారు పోలీసులు. కాకినాడ జీ జీ హెచ్ కి ఎస్సై గోపాలకృష్ణ మృతదేహం తరలించారు. ఎస్పీ రవీంద్రనాధ్ బాబు జీ జీ హెచ్ కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.