THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

హైదరాబాద్ లో ఐటీ హబ్ ఏర్పాటుకు అడుగులు

thesakshiadmin by thesakshiadmin
August 31, 2021
in Latest, Politics, Slider
0
హైదరాబాద్ లో ఐటీ హబ్ ఏర్పాటుకు అడుగులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   సౌత్ ఇండియాలో ఐటీ హబ్ అనగానే బెంగుళూరు తరువాత హైదరాబాద్ పేరే చెప్పుకుంటారు. టెక్నాలజీ రంగంలో భాగ్యనగర్ దూసుకుపోవడమే ఇందుకు కారణం. మెట్రో నగరంలో ఇప్పటికే హైటెక్ సిటీ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో రాజధానిలో మరో ఐటీ హబ్ ను నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు 45 ఎకరాల్లో దీనిని నిర్మించేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ ఏరియా (హెచ్ఎండీఏ) డిజైన్లను కూడా స్వీకరిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ప్రణాళికను చేపట్టి రాజేంద్రనగర్ మండల మరిధిలో ఏర్పాటు చేయనున్నారు. దాని విశేషాలేంటో చూద్దాం.

దాదాపు 200 వరకు స్టార్ట్ ప్ లు.. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రీసెర్చ్ ల్యాబ్స్.. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్క్ ఏరియా.. 10 మినీ కాన్ఫరెన్స్ హాళ్లు.. 6 వేల చదరపు అడుగుల కన్వెన్షన్ సెంటర్..ఇలా దేశంలోనివే కాకుండా ఆసియాలోని నగరాలకు ధీటుగా ఐటీ హబ్ ను నిర్మించనున్నారు.

ఇవే కాకుండా 300 మందికి సరిపడే విధంగా వర్క్ స్టేషన్లు మరో పది వ్యక్తిగత వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. సమావేశాలు నిర్వహించేందుకు అనువైన స్థలం డైనింగ్ ఏరియా హౌస్ కిచెన్లు కూడా సమకూర్చనున్నారు.

వర్క్ స్టేషన్లతో పాటు వసతి సౌకర్యాలు కూడా ఇందులోనే ఏర్పాటు చేయనున్నారు. 40 కుటుంబాలకు సరిపడా రెసిడెన్షియల్స్ ను నిర్మించనున్నారు. త్రిబుల్ బెడ్ రూమ్ లతో కూడిన నాలుగు అపార్ట్ మెంట్లను నిర్మించనున్నారు.

ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు రెస్టారెంట్లు పబ్ లు ఇండోర్ గేమ్స్ స్విమ్మింగ్ ఫూల్ ను నిర్మించనున్నారు. అలాగే ఫిట్ నెస్ కోసం జిమ్ సెంటర్ యోగా సెంటర్ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులు ఇతరుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించనున్నారు. ఇందులో 400 కార్లు 20 బస్సులు 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు.

రాజధానికి వెస్ట్ సైడ్ ఈ ఐటీ కారిడార్ ను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. మండలంలోని బుద్వేల్లోని 45 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడి 282 299 సర్వే నెంబర్లో ఉన్న 165 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే హెచ్ఎండీఏకు అప్పగించారు. ఇందులో 57.15 ఎకరాలను పలు సంస్థలకు అప్పగించగా మిగిలిన 107.25 ఎకరాలు 328 329 330 331 సర్వేనెంబర్లలో ఉంది.

వీటిల్లోని 45 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ లో ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేస్తే ఇక్కడి 200 ఎకరాల ప్రభుత్వ భూముల విలువ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని సంస్థలు దీనిని తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జర్నలిస్టులకు కూడా ఇక్కడే స్థలాన్ని ఇస్తారని అన్నారు. దీంతో జర్నలిస్టుల సంఘాలు ఈ స్థలాలను పరిశీలించాయి. కానీ ఆ తరువాత బుద్వేల్ లో మంత్రి కేటీఆర్ పర్యటించి ఐటీ కారిడార్ కు కేటాయించేందుకు చర్చలు జరుపుతున్నారు.

ఇందులో భాగంగా హెచ్ఎండీఏ అంతర్జాతీయ సంస్థల నుంచి డిజైన్లను ఆహ్వానిస్తుంది. వీటికి ఈనెల చివరి వరకు గడువు కేటాయించారు. ప్రత్యేకంగా నియమించిన కమిటీ డిజైన్లను పరిశీలించనుంది. అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ క్యాంపస్ ను పూర్తిగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు.

మంత్రి కేటీఆర్ పర్యటించిన తరువాత ఇటీవల మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ నేతృత్వంలోని హెచ్ఎండీఏ అధికారుల బృందం పరిశీలించింది. దీంతో ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటుకు అడుగులు వేగమైనట్లు తెలుస్తోంది.

Tags: #HARDWARE#HYDERABAD#HYDERABAD IT HUB#INFORMATION TECHNOLOGY#IT HUB#KTR#MINISTER KTR#SOFTWARE#TECHNOLOGY#TELANGANA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info