thesakshi.com : విధి ఆడిన వింత నాటకం..
నిన్న ఏఎస్ఐ కుమారున్ని ఆశీర్వదించాడు..
నేడు ఏఎస్ఐకి శ్రద్ధాంజలి ఘటించాల్సి వచ్చింది..
ఆ ఎంపీకి ఎదురైన విషాద అనుభవం
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాష్ట్ర ప్రజలందరికీ_ _చిరపరిచితులే….విధి ఆడిన వింత నాటకంలో ఆయన కూడా ఒక పావుగా మారాల్సి రావడం విధి వైచిత్రి… సౌమ్యునిగా పేరొందిన వెంకటస్వామి పామిడి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్నారు…ఏఎస్ఐకి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తో ఆత్మీయ అనుబంధం ఉంది… గతంలో అనంతపురం One Town సీఐగా మాధవ్_ _పనిచేస్తున్నప్పుడు హెడ్ కానిస్టేబుల్గా వెంకటస్వామి పనిచేస్తుండేవారు…. సక్రమంగా..విధులు నిర్వహించే వెంకట స్వామి అంటే మాధవ్ కు ప్రత్యేక అభిమానం ఉంది.
ఏఎస్ఐ వెంకటస్వామి కుమారుని వివాహానికి ముఖ్యఅతిథిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరై నూతన జంటను ఆశీర్వదించారు… పెనుగొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్ళిపోయారు… అంతలోనే పిడుగులాంటి వార్త…. గుండెపోటుతో వెంకటస్వామి చనిపోయారు అనే విషయం తెలిసి ఎంపీ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు… నిన్న వెంకటస్వామి కుమారున్ని ఆశీర్వదించడానికి వచ్చిన నేను నేడు వెంకట స్వామి కి శ్రద్ధాంజలి_ _ఘటించడానికి రావడం తీవ్ర బాధాకరమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బాధాతప్త..హృదయంతో తనను కలసిన విలేకరులతో పేర్కొన్నారు..
సార్ వచ్చినాడు.. మీ నాన్న ఎక్కడున్నా వస్తాడు ఫోన్ చేయరా అంటూ వెంకట స్వామి.. భార్య రోధించడం శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన వారికి కన్నీళ్లు వచ్చేలా చేసింది.