THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

రాజకీయ నాయకుల బలహీనతే ఆయన బలం..!

thesakshiadmin by thesakshiadmin
March 28, 2022
in Latest, Politics, Slider
0
రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ప్రశాంత్ కిషోర్
0
SHARES
62
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎక్కడ ఉంటయో అక్కడ ప్రశాంత్ కిషోర్ ను కోరుకుంటారు పొలిటికల్ పార్టీలు. ఇదే ఆయన బలం. అదృష్టం.. ఇన్నాళ్లు ఇదే తంతు కొనసాగుతోంది. మొత్తానికి పీకే చాలా అదృష్ట వంతుడనే చెప్పాలి.

తనకు తిరుగులేదని.. తన వ్యూహాలకు ఎదురు లేదని.. భావిస్తున్న.. రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్.. ఉరఫ్ పీకే…ఫెయిలవుతున్నాడా? పార్టీల మెప్పుకోసం.. ఆయన నిజాలు దాచి.. వ్యవహరిస్తున్నతీరు.. ఇప్పుడు అందరికీ తేటతెల్లం అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఏపీలో జగన్ను అధికారంలోకి తెచ్చిన తర్వాత… పీకే ఇమేజ్ పెరిగింది. దీంతో అనేక రాష్ట్రాలతో పీకే వ్యాపారం ప్రారంభించారు. వందల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుని.. సొమ్ములు బాగానే వెనుకేసుకుంటున్నాడు.

అయితే.. ఈ వ్యూహాలు ఇటీవల కాలంలో దెబ్బకొడుతున్నాయి. గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్ని కల్లో గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. దాదాపు 200 కోట్ల రూపా యలకు ఒప్పందం చేసుకున్నారని.. అప్పట్లోనే వార్తలు వచ్చాయి.ఇంకేముంది..తృణమూల్ను అధికా రంలోకి వచ్చేలా చేస్తానని.. ఆయన హామి ఇచ్చినట్టు కూడా వార్తలు హల్చల్ చేశాయి. కానీ అక్కడ మమ తా బెనర్జీ పార్టీ ఒక్క సీటూ నెగ్గలేదు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రశాంత్ కిశోర్ సేవలందించారు. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది.

గతం సంగతి వదిలేసినా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోవాలో పీకే వ్యూహాలు ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరోవైపు.. ఇటీవల తెలంగాణలోనూ సర్వే చేసి.. 119 స్థానాల్లో ఒక్క నాలుగు చోట్ల మాత్రమే టీఆర్ ఎస్ ఓడిపోతుందని.. చెప్పినట్టు.. స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరి ఇది ఎంత వరకు నమ్మవచ్చు. బలమైన తెలంగాణ ఉద్యమం సాగి.. సర్కారు ఏర్పడిన తొలి దశలోనే.. కేసీఆర్ పార్టీకి ఈ రేంజ్లో సీట్లు దక్కలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిపోయింది.

వరుస పాలన.. ప్రభుత్వ వ్యతిరేకత.. పార్టీల దూకుడు.. బీజేపీ హల్చల్ కాంగ్రెస్ స్పీడ్ అందుకున్న సమయంలో.. కేసీఆర్ ప్రభుత్వాన్ని 115 స్థానాల్లో ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని పీకే చెప్పడంలో ఎంత మేరకు వాస్తవం.. ఉంది? అనేది చర్చకు దారితీస్తోంది. ఇది కేవలం.. కేసీఆర్ను మెప్పించేందుకు చేసిన ప్రయత్నమేనని అంటున్నారు. అటు గోవా.. ఇటు.. తెలంగాణలో ఇచ్చిన ఫలితాలు చూసిన తర్వాత.. పీకే విఫలమవుతున్నాడనే వాదన వినిపిస్తుండడం.. అది కూడా మేధావి వర్గాల్లోనే కావడం గమనార్హం.

Tags: #Indian political strategist#politicalpartyssurvey#Politics#Prashant Kishor#Prashant Kishor Indian political strategist
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info