thesakshi.com : కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి ఆత్మహత్య చేసుకుంది.
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా, మచిలీపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతి కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.