thesakshi.com : జెసి దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ కు మారిన టీడీపి సింగనమల రాజకీయం
దాదాపు అరవై వాహనాలతో బండారు శ్రావణి బలప్రదర్శన
ఇంచార్జ్ కు అధికారాలు లేవంటే ఎలా సార్
దళిత మహిళనని చిన్న చూపా ?
బండారు శ్రావణి ఆవేదన
కమిటీనే కదామ్మ వేసింది ఎందుకు భయపడతావ్..
నీకు నేనున్నాను : జెసి దివాకర్ రెడ్డి భరోసా
అనంతపురం జిల్లా శింగనమల తెలుగుదేశం పార్టీ రాజకీయం రసవత్తరంగా మారింది… నియోజకవర్గ ఇన్చార్జి ను కాదని అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు మండల స్థాయి నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది… దళిత నాయకురాలైన పార్టీ ఇన్చార్జి బండారు శ్రావణిని కమిటీ బాధ్యతల నుంచి తప్పిస్తూ_ టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై టిడిపి నాయకులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు పై తీవ్ర స్థాయిలో టిడిపి కార్యకర్తలు_ మండిపడిన విషయం విదితమే.. దీనిపై ఏకంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి దాదాపు అరవై వాహనాల్లో పెద్దపప్పూరు మండలం జుటూరు గ్రామం లో ఉన్న జెసి దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లి దివాకర్ రెడ్డిని కలిశారు…. సార్ … నన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం అన్యాయం… చంద్రబాబు నాయుడు, మీ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను….దళిత మహిళ నైన తనకు పార్టీలో అన్యాయం జరుగుతున్నదని జెసి దివాకర్ రెడ్డికి బండారు శ్రావణి వివరించారు.
అమ్మా నీవు బాధపడవద్దు… ముందస్తుగా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు… మా చంద్రబాబునాయుడుకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు…. కమిటీ వేస్తే పని అయిపోతుందా…. నేను ఉన్నా… నీ పదవికి ఏం ఇబ్బంది లేదు… రెండు మూడు రోజుల్లో చంద్రబాబునాయుడు అపాయింట్మెంట్ తీసుకుంటా…. మీరు పది మంది రండి… బాబు తో మాట్లాడి నీకు న్యాయం చేస్తా! తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎప్పటికీ అన్యాయం చేయదు… ఇది గమనించి ఎటువంటి ఆందోళనలు నిర్వహించరాదని బండారు శ్రావణి అనుచరులకు హితవు పలికారు.