thesakshi.com : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆయన ఇంటి గోడను పౌర సిబ్బంది కూల్చివేయడంతో ఆయన ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, పోలీసులతో కలిసి కూల్చివేసేందుకు వచ్చారు.
ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగడంతో రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఇదంతా రాజకీయ దూషణ అని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. వైఎస్ జగన్ భయపడి అరెస్ట్‌లకు దిగుతున్నారని మండిపడ్డారు. ఉత్తర కోస్తాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వస్తున్న స్పందన చూసి ముఖ్యమంత్రి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని లోకేష్ మండిపడ్డారు.
నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది.(1/3) pic.twitter.com/u7KIS1pmq4
— Lokesh Nara (@naralokesh) June 19, 2022
అయ్యన్న పాత్రుడుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండించారు. మూడేళ్లు దాటినా ప్రతిపక్ష నేతల ఇళ్ల కూల్చివేతలను, అరెస్టులను నమ్ముకుని ఉన్న జగన్ రెడ్డిని చూసి జాలి వేస్తోందన్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని ఎద్దేవా చేసారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతరతో వైసీపీ నేతల్లో భయం మొదలైందని పేర్కొన్నారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే సీఎం ఎంతగా భయపడ్డారో అర్దం అవుతోందంటూ వ్యాఖ్యానించారు.
ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను పాల్పడుతోందంటూ దుయ్యబట్టారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆదివారం విధ్వంస దినంగా మార్చేసిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజల వాయిస్ వినిపిస్తున్న అయ్యన్న పైన సీఎం జగన్ కక్ష్య సాధింపుకు దిగుతున్నారంటూ ఆరోపించారు.
ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక ఈ చర్యలు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏపీ గూండారాజ్ గా జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ దుయ్యబట్టారు. పోలీసులు సైతం అతిగా స్పందిస్తున్నారని విమర్శించారు. తన ప్రభుత్వ పునాదులు కదులుతుండటంతో సీఎం జగన్ టీడీపీ నేతలు ఇళ్లను కూలుస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభమైందన్నారు. ఈ రోజు జగన్ దే కావచ్చు.. రేపు తమదని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతల పైన కక్ష్య సాధింపు చర్చలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టారు. నిలదీశారు. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారని.. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. అయితే, ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలంలో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని..ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. నర్సీపట్నంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.