thesakshi.com : జమ్ముకశ్మీర్‌లోని కుల్గావ్ జిల్లాలోని వాన్‌పో ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికేతర కార్మికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఆదివారం జరిగిన ఈ కాల్పులలో ఇద్దరు వలస కూలీలు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని మిలిటెంట్ల కోసం వెతుకుతున్నాయి.
మిలిటెంట్ల కాల్పులలో మరణించిన కార్మికులు ఇద్దరూ బిహార్‌కు చెందినవారు.
శనివారం కూడా మిలిటెంట్లు శ్రీనగర్, పుల్వామాలలో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు.
శ్రీనగర్‌లో మరణించిన వ్యక్తి బిహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
పుల్వామాలో మరణించిన సాగిర్ అహ్మద్‌ది ఉత్తరప్రదేశ్. కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవిస్తున్న ఆయన మిలిటెంట్ల తుపాకులకు బలయ్యారు.
మరోవైపు వరుస దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను ఏరివేసేందుకు కశ్మీర్ పోలీసులు, భద్రతాదళాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి.
గత వారం రోజులలో మొత్తం 13 మంది మిలిటెంట్లను హతమార్చారు.