thesakshi.com : సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టీకరణ.
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదు.
వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలి.
నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలను.
నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలి.
వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో అంతిచ్చేస్తా.
నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడి.. మా సహనాన్ని వైసీపీ పరీక్షించొద్దు.
ప్రజలను పల్లకి ఎక్కించేందుకే జనసేన పని చేస్తుంది.
జనసేనకు వ్యక్తిగత అజెండాలు ఉండవు.
అధికారంలోకి రాకముందు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చాక అల్పాదాయ వర్గాలపై 57 శాతం విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపుతోంది.
వైసీపీ మాటలకు అర్థాలే వేరులే అన్నది నిరూపితమవుతోంది.
కుడి చేత్తో ఇచ్చి.. ఎడం చేత్తో లాగేసుకుంటోంది ఇదే ప్రభుత్వ విధానం.
గతంలో నా దృష్టికి వచ్చిన విద్యుత్ సంబంధిత సమస్యలు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. వాటిని నాటి ప్రభుత్వం పరిష్కరించింది.
పల్లెల్లో 11 గంటల నుంచి 14 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
పట్టణాల్లో ఐదు నుంచి ఆరు గంటల పాటు కోతలు.
నగరాల్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు కోతలు.
ఆస్పత్రుల్లో కూడా విద్యుత్ కోతలు ఉంటున్న పరిస్థితి.
విద్యుత్ కోతల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు.
పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల కార్మికుల ఆదాయానికి గండి పడుతోంది.
అప్పులతో పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామిక వేత్తలకు పవర్ హాలిడే శరాఘాతమే.
వైసీపీ లోపభూయిష్ట విద్యుత్ విధానమే ఈ సంక్షోభానికి మూల కారణం.
ప్రభుత్వానికి తెలివి లేక కాదు.. కావాలనే విద్యుత్ సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది.
గత ప్రభుత్వం పాలసీ సరిగా లేదంటే పాలసీని సరి చేయాలే తప్ప.. పీపీఏలను రద్దు చేస్తే ఎలా..?
ప్రస్తుతం యూనిట్ ధర రూ. 20 పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్న పరిస్థితి.
తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు రాలేదని వైసీపీ ఈ సంక్షోభాన్ని సృష్టించింది.