thesakshi.com : ఇంతలోనే గేమ్ ఛేంజ్ అయ్యింది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మునుపటి స్కేల్ లో కాకుండా అసాధారణ స్కేల్ లోకి షిఫ్ట్ అవుతోందన్నది ఇండస్ట్రీ వర్గాల్లో తాజా గుసగుస. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF – చాప్టర్ 2 విజయవంతమైన తర్వాత ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ అప్ గ్రేడ్ చేయాల్సిన సన్నివేశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ని ఇందులో యాక్షన్ ని అమాంతం పెంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట.
KGF 1- KGF 2 చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు బాహుబలి స్టార్ ని డైరెక్ట్ చేయడం అంటే ఆషామాషీనా? అంచనాలు ఆటోమెటిగ్గా ఆకాశాన్ని తాకుతాయి. బయ్యర్లలో వాటాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే ఇప్పుడు సలార్ 2023 సంవత్సరంలోనే అత్యంత భారీ భారతీయ సినిమాగా పరిగణనలోకి వచ్చింది. KGF విజయం తర్వాత – చాప్టర్ 2 చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ నటించిన తదుపరి సాలార్ అప్గ్రేడ్ అవుతోంది. సినిమా బడ్జెట్ యాక్షన్ రేంజుని మరింతగా పెంచేలా చూడాల్సిన సన్నివేశం కనిపిస్తోందని బాలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది.
KGF మెగా-హిట్ చిత్రాల దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఫిలింమేకర్ గా అవతరించారు. ఏప్రిల్ 14న విడుదలైన KGF – చాప్టర్ 2 అన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మే చివరి నాటికి 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.
అందుకే ఇప్పుడు సలార్ రేంజ్ అమాంతం మారిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ సలార్ స్కేల్ ని మార్చాలని నిర్ణయించినట్టు గుసగుస వినిపిస్తోంది. KGF చాప్టర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత సలార్ ఇప్పుడు బాగా అప్ గ్రేడ్ అవుతోందట.
తాజా సమాచారం మేరకు.. నిర్మాత విజయ్ కిరగందూర్ సినిమాను మరింత అద్భుతమైన విజువల్స్ తో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ ఎక్స్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడానికి బడ్జెట్ ను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. సాలార్ కి ముందు అనుకున్న దాని కంటే అనేక భారీ యాక్షన్ సీక్వెన్సుల్ని జోడిస్తున్నారని సమాచారం.
దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల రాధే శ్యామ్ లో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు ఏమంత నచ్చలేదు. అందుకే కొంత మేర విఫలమైందన్న టాక్ కూడా ఉంది. రాధే శ్యామ్ తో భారీ పరాజయాన్ని చవిచూసిన ప్రభాస్ కెరీర్ కు ఈసారి అదిరిపోయే మ్యాజికల్ టచ్ కావాలి. సలార్ అనేది బాహుబలి తర్వాత పాన్-ఇండియా రేంజును మించి అని భావిస్తున్నారు అభిమానులు. యాధృచ్ఛికంగా ప్రశాంత్ నీల్ KGF – చాప్టర్ 2 విడుదలైన 14 ఏప్రిల్ 2022న సలార్ విడుదల కావాల్సి ఉంది. కానీ అటు ఇటు తారుమారు అయ్యింది.
ఆ డేట్ కి కేజీఎఫ్ 2 వచ్చింది. మహమ్మారి కారణంగా సాలర్ ఆలస్యమైంది. ఇది మరో రకమైన ఆశీర్వాదంగా భావించాలి. ఇప్పుడు కేజీఎఫ్ 2 సంచలన విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ – కిరంగదూర్ రేంజు అమాంతం మారిపోయింది. బడ్జెట్ల రేంజు కూడా అమాంతం పెంచేస్తున్నారట. `సలార్`ని మేకర్స్ ఏకైక బాక్సాఫీస్ మాన్ స్టర్ గా మార్చేందుకు చేయాల్సినవన్నీ చేస్తున్నారట.