THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఆ దిశగా కేంద్రం అడుగులు..!

రాష్ట్రాల్లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

thesakshiadmin by thesakshiadmin
June 29, 2022
in Latest, Politics, Slider
0
ఆ దిశగా కేంద్రం అడుగులు..!
0
SHARES
693
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కేంద్రం శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా ఇటు ఆంధ్రప్రదేశ్  అటు తెలంగాణ  రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి పెంచే విధంగా.. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153 పెంచే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా రిపోర్ట్ వెళ్తే.. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముంది.

రాష్ట్ర విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు పెంచాల్సిన అసెంబ్లీ సీట్ల సంఖ్యపై కేంద్ర సర్కారు కసరత్తు ప్రారంభిం చినట్టు తెలిసింది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. ఏపీ తెలంగాణల్లో త్వరలోనే అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభమైంది.

విభజన చట్టం ప్రకారం.. ఏపీలో 50 స్థానాలు తెలంగాణలో 34 స్థానాలు పెరగాల్సి ఉంది. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు.. 225కు పెరుగుతాయి. అదేవిధంగా తెలంగాణలో 119 స్థానాలకు 153 వరకు పెరగనున్నాయి. దీంతో అధికార ప్రతిపక్షాలకు ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది.

అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే భావన కూడా ఉంది. అయితే.. ఈ ప్రక్రియకు ముందుగానే మోడీ సర్కారు ముహూర్తం నిర్ణయించింది. 2024 ఎన్నికల నాటికి నియోజకవర్గాల ను పునర్వ్యస్థీకరిస్తామని ప్రకటించింది.

అనుకున్న విధంగానే.. వచ్చే ఎన్నికల్లోగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రారంభమైంది. తొలుత దీనికి సంబంధించి బిల్లును రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే పని ప్రారంభమైనట్టు తెలిసింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు వీలుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు పంపాలని.. కేంద్ర న్యాయశాఖ రెండురాష్ట్రాలను కోరినట్టు సమాచారం. రాష్ట్రాలు ఇచ్చే రిపోర్టు ఆధారంగా.. బిల్లును రూపొందించి.. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే దీనిని ప్రవేశ పెట్టే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఇక కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కీలకంగా మారనుంది. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను కేటాయించాల్సి ఉంటుంది. దీనికి కూడా కొంత సమయం పడుతుందని అంటున్నారు. తొలుత.. నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియను చేపట్టి.. దీనిని ఆమోదించుకున్నాక.. గవర్నర్ రాష్ట్రపతి ఆదేశాల మేరకు రిజర్వ్డ్ నియోజకవర్గాలను నిర్ణయించనున్నారు.

అనంతరం వీటికి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి.. గెజిట్లో ప్రకటించిన తర్వాత.. ఈ నియోజకవర్గాలు అమల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు ఎంత లేదన్నా.. ఏడాదిపైనే సమయం పడుతుందని తెలుస్తోంది.

Tags: #ANDHRA PRADESH#assembly segments#Election Commission of India#GOI#political news#political party's#TELANGANACentral governmennt
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info