thesakshi.com : మహనీయుల త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం..
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విస్మరించిన ఘనత చంద్రబాబు ది..
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టికరణ..
మహనీయుల త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైకాపా జిల్లా కార్యాలయం,టవర్ క్లాక్ వద్ద గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు సోమవారం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయులు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం అలుపెరుగని పోరాటం చేశారు ఆ మహనీయుల సేవలను కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ధనార్జన కోసం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారని విమర్శించారు.
రాష్ట్రం విడిపోయాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన చట్టం లోని హామీలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకున్న పాపాన కూడా పోలేదని మండిపడ్డారు.
అయితే 2019 ఎన్నిజల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజన చట్టం లో పొందుపరిచిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూనే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించి పాత సాంప్రదాయాన్నే పాటిస్తూ రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన మహనీయుల సేవలను స్మరించుకొంటోందని తెలిపారు.
నేడు దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పరిపాలన చేస్తూ దేశం గర్వించేలా గుర్తింపు పొంది మాహనీయుల ప్రాణ త్యాగం వృధా కాలేదు అనేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఘనతను సాధించారన్నారు.రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తామన్నారు.