THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Crime

ఓ లంచాదికారి ఇల్లు, బాత్రూం కూడా బంగారమే..!

thesakshiadmin by thesakshiadmin
July 26, 2021
in Crime, Latest
0
ఓ లంచాదికారి ఇల్లు, బాత్రూం కూడా బంగారమే..!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :    ఉన్నత పదవుల్లో ఉన్న చాలా మంది అధికారులు.. లంచం తీసుకోవడం లాంటివి చేస్తుంటారని అందరికీ తెలిసిన విషయమే. అలా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వారు కూడా ఉన్నారు. వీళ్లంతా మహా అయితే.. రూ.లక్షల్లో డబ్బులు కూడా పెట్టి ఉంటారు. కానీ ఓ అధికారి మాత్రం ఆయన తీసుకున్న లంచాలతో.. తన ఇంటికి బంగారంతో నిర్మించుకున్నాడు.

నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఆయన ఇళ్లు చూస్తే చాలు.. ఆయన ఎంత పెద్ద లంచాధికారో తెలుసుకోవడానికి. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల రష్యాలో ఓ భారీ స్కాం బయటపడింది. ఆ స్కాంలో దాదాపు 35మంది ట్రాఫిక్ పోలీసులు భాగమైనట్లు దర్యాప్తులో తేలింది. ఈ స్కాం విచారణలో భాగంగా కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటికి అధికారులు వెళ్లగా.. ఆయనగారి లంచాల విషయం బయటకు వచ్చింది.

విలాసవంతమైన ఇల్లు చూసి మొదట అధికారులు షాకయ్యారు. ఇక ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. వాళ్లకు నోట మాట రాలేదు. ఇంట్లోని చాలా వస్తువులు.. ఆఖరికి బాత్రూమ్ కూడా బంగారంతో తయారు చేసినవి కావడం గమనార్హం.

బంగారంతో మ్యాచ్ అయ్యే.. మర్బుల్స్ వాడటం కొసమెరుపు. ఆ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కూడా బంగారంతో చేయించాడు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఆ ఇంటిని వీడియో తీయగా.. కేవలం 50 సెకన్ల వీడియో.. నెట్టింట వైరల్ గా మారింది.

ఈ లంచాధికారి అలెక్సీ.. అతని కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్ లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది.

అదేకేసులో మరో 35మంది హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాకయ్యారు. అతనిపై ఆరోపణలు రుజువైతే.. అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Tags: #Col Alexei Safonov#CRIME NEWS#Golden Toilet#head of traffic police#RUSSIA#Russian Cop’s Lavish Mansion#Russian police
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info