thesakshi.com : ఎన్నికలు లేవు, ఓట్లకోసం సభ పెట్టలేదు.దేశానికి స్వాతంత్య్రం తేవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది.
యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగింది, నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెసే.మైనార్టీలు ఒకసారి ఆలోచించాలి.
వైస్సార్ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతోమంది మైనార్టీలకు అవకాశాలు లభించాయి.రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే.
కాంగ్రెస్ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే.కారునే, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మిరే.
త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమే.కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలంటి చట్టాలు తెచ్చే దైర్యం చేసేవారా.
మోడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉన్నదీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే.అసద్ చెప్పరనే మైనార్టీల ఓట్లు కెసిఆర్ కు వెళ్లాయి.
కార్ కా స్త్రీరింగ్ అసద్ చేతిలో ఉందని చెప్పుకునే అసద్, త్రిబుల్ తలాక్ అనుకూలంగా రంజిత్ రెడ్డి యెట్లా ఓటు వేస్తారు.మైనార్టీలకు ఎవరివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టాం.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆరెస్ కు వేసే ఓటు బీజేపీ కి వెళ్తుంది.దళితులకంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారు.
జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు, ఇంతవరకు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు.మైనార్టీలకు శత్రువైన కెసిఆర్ ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు రాలేదు కానీ కెసిఆర్ కు ప్రగతి భవన్ భవంతి, కాళేశ్వరం ప్రాజెక్టు దక్కింది.ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూంలు ఇవ్వకపోయినా కనీసం.
10 లక్షలు లోన్లయినా ఇప్పించండి , కష్టపడి పనిచేసి 12 లక్షలు కడుతాం.మోడీ రాక్షసుడు అయన ప్రాణం కెసిఆర్ లో ఉంది అంటూ పిట్టకథ చెప్పిన రేవంత్.
మోడీకి మద్దతుగా నిలిచే కెసిఆర్ పార్టీని ఓడించాలి.కెసిఆర్ కారును జుమ్మెరాత్ బజార్ కు పంపాలి.కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయి.
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి 12 శాతం రిజర్వేషన్ ఇస్తే 20,30 వేల ఉద్యోగాలు వస్తాయి.మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన కెసిఆర్ ప్రతి ముస్లిం కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి.
దళిత లెక్క మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యూడిషరీ పవర్స్ కల్పిస్తామని హామీ ఇస్తున్న..