THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ టైమ్!

thesakshiadmin by thesakshiadmin
April 21, 2022
in Latest, Movies
0
నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ టైమ్!
0
SHARES
34
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :    మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం `ఆచార్య` అనేక వాయిదాల మధ్య ఎట్టకేలకు ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ధర్మస్థలి నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల విరామం తరువాత వస్తున్నచిరు సినిమా అందులోనూ తొలి సారి చిరు చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో `ఆచార్య` అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేస్తున్నారు. `ట్రిపుల్ ఆర్` తరువాత చరణ్ నటించిన చిత్రం కావడం.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో చరణ్ పాత్రని ఆవిష్కరించిన తీరు అడవిలో చరణ్ పై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు.. చిరు సాయంతో గాల్లో చరణ్ చేసే విన్యాసాలు వెరసి సినిమాపై అభిమానుల్లోనే కాకుండా సగటు సినీ లవర్స్ లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేఫథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఇటీవల ట్రైలర్ ఓ లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన మేకర్స్ ప్రత్యేక ఇంటర్వ్యూలల్లో పాల్గొంటున్నారు.

చరణ్ – కొరటాల శివతో కలిసి ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో చరణ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి షాకిచ్చాడు. గత నాలుగేళ్లుగా చరణ్ – చిరుతో కలిసి వుండటం లేదన్న విషయాన్ని బయటపెట్టడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకవుతున్నారు. `గత నాలుగేళ్లుగా ఇప్పడున్న ఇళ్లు కన్ స్ట్రక్షన్ లో వుందని వేరు వేరుగా వుంటున్నాం. సండే స్ మాత్రమే కలుస్తున్నాం. అయితే `ఆచార్య`కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఓ అడవిలో జరిగింది. దాదాపు 20 డేస్ షెడ్యూల్ జరిగింది. ఈ షూటింగ్ వళ్లే మళ్లీ నాన్నతో కలిసి టైమ్ స్పెండ్ చేశాను` అంటూ హీరో రామ్ చరణ్ ఆసక్తికమైన విషయాన్ని వెల్లడించారు.

`గత నాలుగేళ్లుగా ఇప్పడున్న ఇళ్లు కన్ స్ట్రక్షన్ లో వుందని వేరు వేరుగా వుంటున్నాం. సండే స్ మాత్రమే కలుస్తున్నాం. అలాంటిది షూటింగ్ వల్ల దాదాపు 20 రోజలు అక్కడ డబుల్ బెడ్రూమ్ కాటేజీలో నాన్న నేను కలిసే వున్నాం. పొద్దున్నే లేవడం.. కలిసి భోజనం చేయడం..కలిసి ఒకే కారులో షూటింగ్ కు వెళ్లడం.. షూట్ అయిపోగానే ఇద్దరం కలిసి ఒకే కారులో తిరిగి రావడం.. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ లు చేయడం..అది నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ టైమ్. ఆ అనుభూతిని మటల్లో వర్ణించలేను` అన్నారు.

అంతే కాకుండా `ఐదవ రోజు నాన్న ఉదయం `చరణ్ నీకు అర్థమవుతోందా? ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు.. ఆచార్య వల్ల ఆ అవకాశం మనకు వచ్చింది. ఎవ్రీ సింగిల్ డేని సింగిల్ మినిట్ ని ఎంజాయ్ చేద్దాం. ఇలా నాకు మళ్లీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు.. అని చెప్పారు. నేను బయటికి అనలేకపోయాను. నాన్న అనేశారు అంతే. అలా నాన్న అనగానే ఆ క్షణం నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే హగ్ చేసుకుని నా భావాలని వ్యక్తం చేశాను` అని చరణ్ చెప్పుకొచ్చారు.

Tags: #acharyamovie#achraya#Chiranjeevi#FilmNews#koratalasiva#MEGASTAR#RAMCHARAN#telugucinema#TOLLYWOOD
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info