thesakshi.com : సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి నిందితుడు రాజు ఏడు రోజులుగా కనపడకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. రైల్వే ట్రాక్‌పై గుర్తించింది రాజు మృతదేహమేనని పోలీసులు నిర్ధారించారు.
నిన్న ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రాజు సంచరించినట్లు గుర్తించారు. ఇటీవల రైలు ప్రమాద ఘటనలు, ఆత్మహత్యల్లో గుర్తు తెలియని మృతుల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. పోలీసులు భావించినట్లే రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుస్కున్న పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి పరిశీలించగా.. అతడి చేతులపై మౌనిక అనే పచ్చబొట్లు ఉంది. రాజును గుర్తించడానికి ఇదే ప్రధాన ఆధారంగా ముందు నుంచీ పోలీసులు భావిస్తున్నారు. రాజు భార్య పేరు మౌనిక. తాను పోలీసుల నుంచి తప్పించుకోలేనని గ్రహించిన రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజు ఫోన్ వాడకపోవడం వల్లే అతని పట్టుకోవడం ఆలస్యమైంది.
ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేసు ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్-వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు గమనించారు.
నగర నడిబొడ్డులోని సైదాబాద్-సింగరేణి కాలనీలో హత్యాచారం చేశాక రాజు తప్పించుకున్నాడు. అతడు చివరి సారి ఉప్పల్ లో కనిపించాడు. తర్వాత అతడి ఆచూకీ కోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు. 10 లక్షల రివార్డ్ ప్రకటించారు. చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
కాగా నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలపై హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు స్పందించారు. నిందితుడు రాజు ఆత్మహత్యపై బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తమ కళ్లతో చూసిన తర్వాతే నమ్ముతామని చెప్పారు.
చాలా మంది టాటూలు వేయించుకుంటారని.. మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్ కు తీసుకురావాలన్నారు. మరోవైపు రాజు ఆత్మహత్యపై పోలీసుల సమాచారం అందుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.