thesakshi.com : ఆస్తులు అంతస్తులు కాదు.. వ్యామోహమే మిన్న అని ఒక కోటీశ్వరుడి భార్య నిర్ణయించుకుంది. సిరిసంపదలు వదలి ఓ ఆటోరిక్షా డ్రైవర్ తో పారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. ఈ విచిత్రమైన కేసులో ఒక మిలియనీర్ వ్యాపారవేత్త భార్య తన కంటే 13 సంవత్సరాలు చిన్నవాడైన ఆటోరిక్షా డ్రైవర్తో పారిపోయింది.
అక్టోబరు 13న ఇండోర్లోని ఖజ్రానా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. తన భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి రూ.47 లక్షలు తీసుకుని తన భార్య పారిపోయిందని ఆ మిలియనీర్ ఆరోపణలు చేశాడు.
ఆటో రిక్షా డ్రైవర్ తరచూ మిలియనీర్ భార్యను ఆమె ఇంటి వద్దదించేవాడు. అక్టోబరు 13న రాత్రి ఇంటికి రాకపోవడంతో భర్త అంతా వెతికాడు. ఆ తర్వాత తన ఇంట్లో రూ.47 లక్షలు మాయమైనట్లు గుర్తించాడు. భూ యజమాని అయిన భర్త ఇంత భారీ డబ్బును అల్మారాలో ఉంచినట్లు వార్తా కథనాల ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. కోటీశ్వరుడి భార్య – ఆటో రిక్షా డ్రైవర్ కోసం అన్వేషణ కొనసాగుతోంది.
ఆటోరిక్షా డ్రైవర్ పేరు ఇమ్రాన్ అని ప్రాథమిక విచారణలో తేలింది. అతను 32 సంవత్సరాల వయస్సు గలవాడు. మధ్యప్రదేశ్ లోని నాలుగు నగరాలు ఖాండ్వా జావ్రా ఉజ్జయిని రత్లాం లో కనిపించినట్టుగా గుర్తించబడ్డాడు. డ్రైవర్ నిందితురాలు ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. అంతే కాదు ఇమ్రాన్తో స్నేహంగా ఉన్న మరో వ్యక్తి ఇంట్లో కొందరు అధికారులు రూ.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇక మరో ఘటనలో ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహ వేదిక నుంచి రహస్యంగా అదృశ్యమైన ఘటనలో ఆ వరుడి ఆచూకీ తాజాగా చిక్కింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని మహరాజ్పూర్ పట్టణంలో చోటుచేసుకుంది. వధూవరులు దండలు మార్చుకున్నాక తాళికట్టే సమయానికి వరుడు మాయమయ్యాడు.
కుటుంబ సభ్యులు ప్రధాన వివాహ వేడుకలకు సిద్ధమవుతుండగా వరుడు అకస్మాత్తుగా వేదిక నుండి అదృశ్యమయ్యాడు. వరుడి కోసం ఇరు కుటుంబాలు చాలాసేపు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి వరుడు తనకు మాత్రమే తెలిసిన కారణాలతో వేదిక నుంచి పారిపోయాడని వధువు కుటుంబానికి తెలిసింది. ఊహించిన విధంగా వధువు కుటుంబీకులు ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యారు. పెళ్లికి కొద్ది క్షణాల ముందు వధువు పెళ్లి నిలిచిపోవడంతో ఆవేదన కు గురయ్యారు. తాజాగా ఆ వరుడు చేతికి చిక్కాడు.