thesakshi.com : సాధారణంగా అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుండటం మనం చూడొచ్చు. అయితే చిన్న చిన్న తప్పులు అయితే సర్దుకుపోవచ్చు. కానీ ఏదైనా పెద్ద తప్పు జరిగితే వాటి వల్ల వచ్చే కాన్సీక్వెన్సెస్ చాలానే ఉంటాయి. ఓ భారతీయుడి విషయంలో అదే జరిగింది. అది అనుకోకుండా జరిగినప్పటికీ దాని ఫలితాన్ని ఇంకా అనుభవిస్తున్నాడు. ఇంతకీ అతడి కథేంటంటే..
కేరళ రాష్ట్రం ఇరింజలకుడ కన్నికులంగరాకు చెందిన గోపాల క్రిష్ణన్ నయారంబలంకు చెందిన చంద్రన్ గుడ్ ఫ్రెండ్స్. చాలా ఏళ్ల బంధం వీరిది. అబుదాబిలో ఒకే రూంలో కొన్నేళ్ల పాటు నివాసం ఉన్నారు. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఓ ఘటన గోపాల క్రిష్ణన్ జీవితాన్ని తలకిందులు చేసింది. వారి నివాసంలో ఒక రోజు మిత్రుడు చంద్రన్ తన రూంలోనే ఉండే ఆంధ్రాకు చెందిన వ్యక్తితో ఓ విషయమై గొడవపడుతున్నాడు. ఆ సమయంలో గోపాల క్రిష్ణన్ వంటగదిలో ఉండిపోయాడు.
కొద్దిసేపటికి గొడవ శబ్దాలు ఆయనకు వినపబడి బయటకు వచ్చాడు గోపాల క్రిష్ణన్. ఈ క్రమంలోనే తనే చేతిలో చాకును పట్టుకుని వచ్చాడు. అప్పటికే గోపాల క్రిష్ణన్ ఫ్రెండ్ చంద్రన్ అరుస్తున్నాడు. గోపాల క్రిష్ణన్ వచ్చి చూస్తున్న క్రమంలోనే చంద్రన్ ఆంధ్రావ్యక్తి ఒకరినొకరు తీవ్రంగానే కొట్టుకున్నారు. దాంతో వారిని చూసి ఏం పాలుపోక గోపాల క్రిష్ణన్ చంద్రన్ను వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. గొడవ సద్దుమణిగించేందుకుగాను గోపాల క్రిష్ణన్ తనదైన ప్రయత్నం చేశాడు. ఆ టైంలో క్రిష్ణన్ చేతిలో ఉన్న చాకు అనుకోకుండా చంద్రన్కు బలంగా గుచ్చుకుంది. అంతే.. క్షణాల్లోనే తీవ్రమైన రక్తస్రావం జరిగింది.
చంద్రన్ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అలా చంద్రన్ మృతికి కారణమైన క్రిష్ణన్ను దుబాయ్ పోలీసులు జైలులో పెట్టారు. ఈ నేపథ్యంలోనే 2010లో ఎర్నాకులం కలెక్టర్ సమక్షంలో చంద్రన్ బాలక్రిష్ణన్ కుటుంబాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. చంద్రన్ కుటుంబానికి క్రిష్ణన్ ఫ్యామిలీ తరఫున పరిహారంగా రూ. 75 లక్షలు చెల్లించాలని అనుకున్నారు. ఈ మేరకు ఒప్పందం చేసుకోగా పరిహారం చెల్లిస్తే దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించేలా చేస్తామని చంద్రన్ ఫ్యామిలీ పేర్కొంది. అంతే ఇక..దీనికోసం క్రిష్ణన్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ అమౌంట్ వారి ఆర్థిక పరిస్థితికి చాలా మించినదని చెప్పొచ్చు.
రూ.75 లక్షల్లో ఇంత వరకు రూపాయి కూడా జమ చేయలకేపోయారు. దాంతో 14 ఏళ్లుగా గోపాల క్రిష్ణన్ జైలులోనే మగ్గుతున్నాడు. ప్రస్తుతం అతడి వయస్సు 74 ఏళ్లు. ఇక గోపాల క్రిష్ణన్ వైఫ్ థనకామని వయసు ఇప్పుడు 70 ఏళ్లు కాగా ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. క్రిష్ణన్ జైలుకు వెళ్లిన తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం అతడిని ఎలాగైనా జైలు నుంచి వీడిపించాలని ప్రయత్నిస్తూనే ఉంది. అటు మృతుడు చంద్రన్ భార్య సునీత మాట్లాడుతూ ఇప్పటివరకు క్రిష్ణన్ కుటుంబం నుంచి తనకు ఎటువంటి పరిహారం అందలేదని పేర్కొంది.
తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని చంద్రన్ సంపాదనతోనే ఇల్లు గడిచేదని తెలిపింది. భర్త మృతితో ఇప్పుడు తన ముగ్గురు కూతుర్ల భవిష్యత్తు ఏంటో పాలుపోవడం లేదని జీవితం ప్రశ్నార్థకం మారిందిని తెలిపింది. మొత్తంగా అనుకోకుండా జరిగిన ఘటన రెండు కుటుంబాలను దు:ఖంలోకి నెట్టేసింది.