thesakshi.com : కర్నూల్ జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు బావిలో పడి మృతి చెందారు. సాయికుమార్, కార్తీక్, రాజేశ్, కమాల్ బాషా ఆలంకొండకు చెందిన స్నేహితులు. గురువారం సాయంత్రం పూట సరదాగా నలుగురు కలిసి ఓ పొలం వద్దకు ఈతకు వెళ్లారు.
అక్కడే వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ మోటార్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.