thesakshi.com : గోడకూలి రెండు వందలు గొర్రెలు మృత్యువాత…
కనగానపల్లి మండలం, మండల కేంద్రంలో సోమవారం సాయం కాలం కురిసిన భారీ వర్షానీకి గోడ కూలి పిండాకు నాగేష్ కు చెందిన సుమారు 200 దాకా గొర్రెలు మరణించాయి.
మండల కేంద్రంలో కోటలోని బాలకృష్ణ కు సంబంధించిన తోటలో, చాలా కాలం కిందట నిర్మించిన రేషన్ షెడ్ సోమవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి 200లకు పైగా గొర్రెలు మరణించినట్లు బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు.
వీటి వల్ల సుమారు 20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు వారు తెలియజేశారు.ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.