thesakshi.com : ఉగాది రోజు ఏపీ కేబినెట్ పునర్‍వ్యవస్థీకరణ
అదేరోజు ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త మంత్రులు
మార్చి 27న పాత మంత్రివర్గం రాజీనామా
మళ్లీ ఐదుగురు డిప్యూటీ సీఎంలు
మహిళకే మళ్లీ హోంమంత్రి పదవి వరించే అవకాశం
బీసీ, ఎస్సీ సమీకరణాలు, మహిళ కోటా యథాతదం
దాదాపు రెండున్నరేళ్ల తరువాత శాసనసభాపక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల విజయం తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో వైసీపీ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అప్పట్లోనే మంత్రులుగా కొద్ది మందికి అవకాశం కల్పిస్తున్నాం.. రెండున్నరేళ్ల తరువాత మరో కొంతమందికి అవకాశం కల్పిస్తాం. మంత్రి పదవుల నుంచి వైదొలిగిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ చెప్పారు.
ఆ తరువాత సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేతో సమావేశమైన సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. రెండున్నరేళ్లు పూర్తయిపోయిన సందర్భంగా సీఎం జగన్ వారి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సమావేశం జరపనున్నారు. అయితే ఈ భేటీలో మంత్రి పదవుల గురించి చర్చిస్తారా..?. లేక పార్టీ బలోపేతం గురించి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారా..?.
ఏపీ కేబినెట్ మార్పు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారనే మాటలు చాలా సందర్భాల్లో వినిపించాయి. ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు కూడా విన్నాం. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. ప్రభుత్వమే టార్గెట్‌గా వారి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
విపక్షాల మాట ఎలా ఉన్నా.. సీఎం జగన్ మాత్రం.. ముందుగానే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా ఆ దిశగా సిద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. మళ్లీ ఘనవిజయమే లక్ష్యంగా ఇవాళ నిర్వహిస్తున్న వైసీఎల్పీ సమావేశంలో ఏం చెబుతున్నారన్నది చూడాలి.
2024కు ఇప్పట్నుంచి ఎమ్మెల్యేలంతా జనంలోనే ఉండాలంటూ ఆల్రెడీ సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. వైసీఎల్పీ మీటింగ్‌లో క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వనున్నారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..? ఏం చెప్పాలి..? మూడేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది..? ఇంకా ఏం చేయాలి అనుకుంటోంది.. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు.. సంక్షేమ ఫలాలు ఇలా అన్నింటినీ ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి అన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితులపై తన దగ్గరున్న నివేదికలను బయటపెట్టనున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించనున్నారు.
మంత్రివర్గ మార్పులపై ఇప్పటికే సంకేతాలిచ్చిన సీఎం జగన్, వైసీఎల్పీ మీటింగ్‌లో దానిపై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశముంది. మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. దాంతో, కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుంది అన్నదానిపైనా నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మంత్రి పదవులు కోల్పోయినవాళ్లు, ఛాన్స్ దక్కనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సూచించనున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏం చేయాలి అన్నదానిపై ఎమ్మెల్యేలకు సూచనలు చేయడంతో పాటు.. ఎవరి బాధ్యత ఏంటి..? ఎవరి పని తీరు ఎలా ఉంది.. పని చేయపోతే పదవులు ఉండవు అనే అంశాలపై ఆయన నేరుగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఏపీలో అధికార పార్టీ సిట్టింగ్ లకు షాక్..?
ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో సగాని పైగా ఎమ్మెల్యేకు సీటు ఇవ్వొద్దని ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి మరీ చెప్పేశారట.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆయా ఎమ్మెల్యేకు సీట్లు ఇస్తే డ్యామేజ్ తప్పదని తేల్చి చెప్పేసినట్టు టాక్. ఏపీలోని సింహభాగం సీట్లకి అస్సలు పాతవారికి ఛాన్స్ ఇవ్వొద్దని ఖరాఖండీగా రిపోర్ట్ లో చెప్పినట్టు సమాచారం. రాశేశారట. కారణాలు ఏవైనా.. నెక్స్ట్ ఎన్నికల్లో 70 శాతం మందికి టిక్కెట్ రాదనేది స్పష్టమవుతోంది.
అందులో పీకే వ్యూహాలు పని చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పీకేని అధినేత జగన్ ఫాలోఅయిపోతారన్నది వైసీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
తాజాగా పీకే టీమ్ రిపోర్ట్స్ పైనే సీఎం ఆధారాపడుతున్నారని.. సొంత పార్టీ నేతలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులతో పాటు పీకే నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇటీవల సీఎంకు పీకే రిపోర్ట్స్ ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాలలో కొత్తవారిని నియమించాలని సూచనలు ఉన్నాయి. ఇటు అనంతపురం నుంచీ అటు శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ ను జగన్ ముందుంచారట పీకే. అంతేకాదు. నియోజకవర్గాల స్థాయిలో ఆ ఎమ్మెల్యే ఏం చేశారు..? ఎంత ఆదరణ ఉంది..? ఏఏ బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి..? ఎంతవరకూ పార్టీకి ప్లస్ అవుతారాు.. లేక మైనస్ అవుతరా..? వంటి పలు అంశాల్ని పరిగణలోకి తీసుకుని సర్వే చేశారట. దీని ఆధారంగా చాలా మంది ఎమ్మెల్యే పీకేకి నచ్చలేదు. దాదాపు జనాల్లో కూడా నామ్ కే వాస్తే గా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చారట. వాళ్లకి ఇక అవకాశం ఇవ్వొద్దని రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారని తెలుస్తుంది.