thesakshi.com : రాజీనామాలకు రెడీ అనడమే తప్ప..టీడీపీ రాజీనామా చేసేది లేదు
-వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రతి సారి రాజీనామాలకు రెడీ అనడమే తప్ప..టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేది లేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆయన సవాలు విసిరారు.
గతంలో ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారని గుర్తు చేశారు
టీడీపీ హయాంలో 100 మందికి పైగా సలహాదారులు ఉన్నారని తెలిపారు. కన్సల్టెన్సీ పేరుతో మరో 200 మందిని నియమించారని చెప్పారు.అధికారాన్ని దుర్వినియోగం చేసింది చంద్రబాబే అన్నారు.
అమరావతిలో ఎలాంటి భూ కుంభకోణం జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. అమరావతి అంటేనే పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణమని విమర్శించారు.
రాష్ట్రానికి సంబంధించి ఏ చిన్న అంశం వచ్చినా కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు మేం రాజీనామాలకు రెడీ మీరు రెడీనా అంటున్నారు. ఆయన కానీ, ఆయన వద్ద ఉన్న ఎంపీలు రాజీనామా చేయకుండా ఎవరైనా ఆపారా? మేం చేసి చూపించాం. వైయస్‌ఆర్‌సీపీలోకి రావాలంటే వేరే పార్టీ వాళ్లు రాజీనామా చేసి రావాలని ఒప్పించి చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
2018లో మా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. నిరాహారదీక్ష కూడా చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కడుతుంటే వైయస్ జగన్ ఆ రోజు జలదీక్ష చేశారు. చంద్రబాబును పిలవలేదు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.
మాకు సవాలు విసిరే బదులు ఆయన ఎంపీలతో రాజీనామా చేయించాలి.
టీడీపీ హయాంలో 100 మంది సలహాదారులు ఉన్నారు. 200 మందిని కన్సల్టెన్సీలుగా పెట్టుకున్నారు. మేం ఇలాంటి అడ్డగోలు ప్రశ్నలు అడగలేదు. అధికార దుర్వినియోగం చేశారని ఆ రోజు ప్రశ్నించాం. ఆ రోజు పరకాల ప్రభాకర్, కుటుంబ రావు అనే వ్యక్తులు రోజు రాజకీయాలేమాట్లాడేవారు. మేమన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నాం. ఈ రోజు సలహాదారులు ఉండటమే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రెడింగ్ జరగలేదన్న రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కోర్టుకు సంబంధించి సాంకేతికను అందించలేకపోయారేమో తెలియదు. అమరావతి అన్నది పెద్ద స్కామ్..మోసం..రియల్ ఎస్టేట్ వ్యాపారం. భూములను అడ్డగోలుగా తీసుకున్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో కొందరికి ముందే తెలిసి ఇలా చేశారు.
గుంటూరు– విజయవాడ మధ్యలో రాజధాని అనే విషయం తెలిస్తే నాగార్జున యూనివర్సిటీ వద్ద భూములు కొంటారు కానీ, ఎక్కడో మారుమూల గ్రామంలో భూములు కొన్నారంటే దాని అర్థం ఏంటి. దారి కూడా సరిగా లేని చోట ఉద్ధండరాయుడి పాలెంలో భూములు ఎలా కొన్నారో అందరికీ తెలుసు. తీర్పుపై కామెంట్లు చేయడం లేదు.
కేసులు పుష్కలంగా ఉన్నాయి. అన్ని అవకతవకలే. మొత్తం అందరూ బయటకు వస్తారు. విచారణను ఎవరూ ఆపలేరు. తప్పు చేసిన వారంతా శిక్ష అను¿¶ వించక తప్పదు. న్యాయస్థానాలు కూడా విచారణకు తగిన రీతిలో తీర్పు ఇస్తాయని భావిస్తున్నాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన పరిధి మేరకు చేయగలదు. ఎంపీలు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖ ఉక్కును నిలుపుకోవాలి. వందకు వంద శాతం గట్టిగా ప్రయత్నం చేసి విశాఖ ఉక్కును నిలుపుకోవాలి. రాష్ట్రం మొత్తం ఒక సెంటిమెంట్‌గా ఉందని కేంద్రం కూడా అనుకుంటుంది.కచ్చితంగా విశాఖ స్టీల్‌ను నిలుపుతామన్న ధీమా మాకు ఉంది. అన్ని రకాలుగా వాయిస్‌ను కేంద్రానికి వినిపిస్తున్నాం. వయబులిటీకి స్కోప్ ఉందని భావిస్తున్నాం.
చంద్రబాబు, రఘురామకృష్ణమ రాజుకు సంబంధించి వాట్సాప్ చాటింగ్ విషయంలో సీఐడీ కేసు పెట్టింది. అంతకంటే ముందు ప్రజలందరికీ వారి మధ్య ఏం జరుగుతుందో తెలుసు. జర్నలీస్టులకు ఇంకా బాగా తెలుసు. చంద్రబాబు లాంటి తల్లి వేరు నుంచే డైరెక్షన్ వచ్చింది.
న్యాయమూర్తులను దుర్భాషలాడిన అంశంపై సుమోటాగా స్వీకరిస్తారని అనుకుంటున్నాం. సీనియర్ జడ్జి గురించి దుర్భాషలాడిన విషయం రికార్డేడ్‌గా దొరికింది. దానిపై వాళ్లే నిర్ణయం తీసుకోవాలి.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రతిదీ పారదర్శకంగా జరిగింది. ఎక్కడా కూడా అవినీతి జరిగే అవకాశం లేదు. టీడీపీ నేతల నోట్లో ఎప్పుడు స్కామ్‌లే వస్తాయి. లక్ష కోట్లకు పైగా లబ్ధిదారులకు నేరుగా అందించాం. ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మధ్యలో ఎవరూ దళారులు లేకుండా లబ్ధిదారులకు అందించాం. టీడీపీ లాగా అడ్డగోలు దిక్కుమాలిన ఆలోచనలు సీఎం వైయస్ జగన్ ఎప్పుడు చేయలేదు.