thesakshi.com : గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమా లు బాలీవుడ్ లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కొన్ని రీమేక్ అయ్యి బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లను దక్కించుకుంటూ ఉంటే.. మరి కొన్ని సినిమాలు డబ్బింగ్ అయ్యి అక్కడ డైరెక్ట్ హిందీ సినిమా ల రేంజ్ లో ఆడుతున్నాయి.
ఈమద్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిన్నా పెద్ద హీరో అనే తేడా లేకుండా పలువురు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వారి వారి సినిమాల హిందీ వర్షన్ లతో యూట్యూబ్ లో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న సినిమాలు వారి క్రేజ్ కు నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఈమద్య కాలంలో టాలీవుడ్ హీరోలు డైరెక్ట్ హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ కు ఆ అవకాశం వచ్చిందట.
ప్రభాస్ ఆదిపురుష్ ను హిందీలో చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ లైగర్ ను హిందీ మరియు తెలుగు లో చేస్తున్నాడు. వీరిద్దరు మాత్రమే కాకుండా హిందీలో బెల్లంకొండ వారి అబ్బాయి కూడా హిందీలో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ ఒక హిందీ సినిమాను చేసే అవకాశంను దక్కించుకున్నాడట.
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి హిందీ తెలుగు లో ఒక సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిందట. ఆ సినిమాలో వరుణ్ తేజ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారని.. ఇప్పటికే ఒక దర్శకుడు కూడా ఓకే అవ్వడం.. స్టోరీ లైన్ కూడా ఖరారు అవ్వడం జరిగిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన తదుపరి చర్చలు ప్రారంభం అయ్యాయి.
బాలీవుడ్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించబోతున్న సినిమా గురించి అతి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ సినిమా విషయమై ఎలాంటి అఫిషియల్ క్లారిటీ అయితే రాలేదు కాని మెగా వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ఈ ద్వి భాష సినిమా గురించి చర్చించుకుంటున్నారు. హిందీలో మన హీరోలు ఈమద్య కాలంలో బాగానే సత్తా చాటుతున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకన్నారు. అందుకే అక్కడ టాలీవుడ్ హీరో మూవీ అంటే ఒక క్రేజ్ ఉంటుంది. అందుకే వరుణ్ తేజ్ కూడా అదే తరహా లో బాలీవుడ్ సినిమా లను చేయడం ద్వారా పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని వారాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది.