thesakshi.com : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి వార్తలు గుప్పుమనడం.. చల్లారడం కామన్ గా మారిపోయింది. తన ప్రియుడు విఘ్నేష్ తో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ.. కొన్ని నెలలుగా ప్రచారం సాగుతూనే ఉంది. కానీ.. ఆ మూడు ముళ్లు మాత్రం పడటం లేదు. తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్-నయనతార చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి వీరి సహజీవనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వారి వివాహం గురించి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వారిద్దరూ వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
విఘ్నేష్-నయన్ ఈ ఫిబ్రవరిలోనే వివాహం చేసుకోబోతున్నారని గతంలో కోలీవుడ్ మీడియా వెల్లడించింది. కానీ.. అది జరగలేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చిలో వీరిద్దరూ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. ఈ పెళ్లి హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు కూడా అధికారికంగా ప్రకటన రాకపోవడం గమనార్హం.
2015 తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీ ధాన్’ షూటింగ్ సందర్భంగా నయన్-విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వారి డేటింగ్ కొనసాగింది. వీరిద్దరూ కలిసి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఫ్యాన్స్ లైక్ చేయడం కామన్ అయిపోయింది. మరి ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.