thesakshi.com : చిత్రం :విరాట పర్వం
స్టార్ కాస్ట్ సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి
దర్శకుడు వేణు ఊడుగుల
నిర్మాత డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి
సంగీతం సురేష్ బొబ్బిలి
రన్ టైమ్ 2 గం 31 నిమిషాలు
17 జూన్ 2022న విడుదల
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది.ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన పీరియడ్ లవ్ డ్రామా, విరాట పర్వం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం.
కథ
విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి..ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే.
విరాట పర్వం 70వ దశకంలో వెన్నెల పుట్టుకతో మొదలవుతుంది, 80లు మరియు 90ల కాల వ్యవధిలో. ఒక చిన్న గ్రామానికి చెందిన వెన్నెల (సాయి పల్లవి) అనే అమ్మాయి నక్సలైట్ నాయకుడు రవన్న (రాణా దగ్గుబాటి) రాసిన విప్లవాత్మక నవలలతో ఆకట్టుకుంటుంది. చివరికి, వెన్నెల రవన్నతో ప్రేమలో ఉందని తెలుసుకుని, ఇంటి నుండి పారిపోయి అతన్ని కలవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో వెన్నెల ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరకు రవన్నను కలుస్తాడు. తన ప్రేమను వెల్లడించిన వెంటనే, వెన్నెల ప్రేమ ప్రతిపాదనను రవన్న అంగీకరిస్తాడా? ఈ ఇంటెన్సివ్ డ్రామాలో నక్సలైట్‌లతో పాటు వెన్నెల ఎలా నిలదొక్కుకుంటాడు అనేది సినిమాకి కీలకమైన అంశం.
విశ్లేషణః
`విరాటపర్వం` సినిమాని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించినట్టు చెప్పిన విషయం తెలిసిందే. నక్సలైట్ రవన్నని ప్రేమించిన సరళ అనే అమ్మాయి ఆయన్ని కలవాలని, తన ప్రేమని వ్యక్తం చేయాలని భావిస్తుంది. అయితే ఆమెని పోలీసులు పంపించిన కోవర్ట్ గా అనుమానించి నక్సలైట్లే చంపినట్టు యదార్థ సంఘటలు చెబుతున్నాయి. ఈ పాయింట్‌లో ప్రేమ ఉంది, స్ట్రగుల్ ఉంది, ఎమోషన్ ఉంది. మంచి ఫీల్ ఉంది. కమర్షియాలిటీకి తగ్గ అంశాలన్ని ఉన్నాయి. ఎంతో లిబర్టీ తీసుకుని కూడా సినిమాని తీయోచ్చు. కానీ దర్శకుడు వేణు ఊడుగుల వాటిని పట్టించుకోకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. సినిమా ప్రారంభం నుంచి వెన్నెల.. రవన్నని కలవాలని, ఆయన్ని ప్రేమలోనే మునిగి తేలుతున్న అంశంపైనే ఫోకస్ పెట్టారు. రవన్నపై ఆమెకి ప్రేమ కలగడానికి బలమైన కారణం చూపించలేకపోయాడు. బలమైన స్ట్రగుల్స్ ఆమె జీవితంలో లేకపోవడంతో ఆమె ప్రేమలో ఎమోషన్ మిస్ అయ్యింది. వెన్నెల ప్రేమలో ఫీల్ మిస్ అయ్యింది. దీంతో ఆమె ప్రేమ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. వెన్నెల అంతగా ఆయన్ని ఎందుకు ఇష్టపడుతుందో ఆడియెన్స్ కి అర్థం కాదు.
ప్రదర్శనలు:
నిస్సందేహంగా, సాయి పల్లవి ఇచ్చిన పాత్రలో అక్షరాలా జీవించి, తన కమాండర్ నటనతో మెప్పించినందున ఈ చిత్రానికి అతిపెద్ద ఆస్తి.
రానా దగ్గుబాటి విషయానికి వస్తే, నక్సలైట్ నాయకుడిగా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. రానా భౌతిక రూపం మరియు డైలాగ్ డెలివరీ ఈ సీరియస్ డ్రామాకి వాస్తవిక ఆకృతిని తెస్తాయి.
జరీనా వహాబ్, ప్రియమణి, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, సాయి చంద్, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ వంటి ఇతర కళాకారులు తమ సహాయక పాత్రలను చాలా సమర్థవంతంగా చేసారు.
టెక్నీషియన్ల పనితీరుః
సురేష్ బొబ్బిలి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. సినిమా నేపథ్యానికి తగ్గ సంగీతం, బీజీఎం అందించారు. పాటలన్నీ కథలో భాగంగానే రావడం కూడా ప్లస్ అనే చెప్పాలి. డానీ సలో, దివాకర్ మణి కెమెరా వర్క్ బాగుంది. పీరియడ్ లుక్‌లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. చాలా నేచురల్‌గా ఉన్నాయి. శ్రీ నాగేంద్ర ఆర్ట్ వర్క్ ప్రశంసనీయం. అప్పటి కాలానికి తీసుకెళ్లాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఫైనల్‌గా దర్శకుడు వేణు ఉడుగుల ఎత్తుకున్న పాయింట్ బాగానే ఉన్నా, దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో తడబడ్డారనిపిస్తుంది. ఎంత విప్లవ నేపథ్య కథ అయినా నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, కాస్త ఎంటర్‌టైనింగ్‌గానే, ఎంగేజింగ్‌గానే, ఎమోషనల్‌గా చెబితేనే ఆకట్టుకుంటుంది. ఆ పాయింట్‌ని వదిలేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో `విరాటపర్వం` కథ చెప్పడమే ఇక్కడ కమర్షియాలిటీ పరంగా చిక్కొచ్చి పడింది.
రేటింగ్ : 3/5