thesakshi.com : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
యాసంగి ధాన్యం మొత్తం కొనాలని కేబినెట్ నిర్ణయం
ధాన్యం కొనుగోలుకు రూ. 3 వేల కోట్ల వ్యయం అంచనా
మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనే అవకాశం
మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం
జీవో 111 ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఆరు ప్రైవేట్ వర్సీటీలకు కేబినెట్ ఆమోదం
ఫార్మా, సివిల్ ఏవియేషన్ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం
మెడికల్ ప్రొఫెసర్ల వయో పరిమితి 65కు పెంపునకు ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయో పరిమితి మూడేళ్లకు పెంపు
గ్రూప్1, 2 ఇంటర్వ్యూల రద్దునకు కేబినెట్ ఆమోదం
వర్సిటీల్లో 3,500 నియామకాలకు కేబినెట్ ఆమోదం
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ కేబినెట్ ఆమోదం
చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు తాగునీరు
ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు
10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టునుండి ఈ పథకానికి వినియోగించనున్నారు.
పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు..
సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు…
లక్ష్మీబారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు,,,
మొత్తంగా 90,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తూ,రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది.
2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది.
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉండటం భారత రైతుల దురదృష్టం.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కేంద్రాన్ని అడిగితే చేయలేదు.
ఎరువుల మీద కేంద్రం ధరలు పెంచడం దారుణం.
బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని అంటున్నరు.
వ్యవసాయరంగాన్ని బలహీన పర్చే అంతర్గత కుట్రలో ఇదంతా భాగం.
రైతులకు మద్దతు ధర ఇస్తామన్నరు. ఈరోజు వరకు అతీగతీ లేదు.
దేశ రైతాంగమంతా ఈ విషయాలను గమనిస్తున్నది.
తెలంగాణలో పండించిన వరిధాన్యం విషయంలో కేంద్రం వితండవాదం చేస్తూ, తలా తోక లేకుండా వ్యవహరిస్తున్నది.
నేను స్వయంగా వెళ్లిన. మంత్రులంతా వెళ్లిండ్లు.
కేంద్రమంత్రి అవమాన పరుస్తూ మాట్లాడిండు.
మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయండి అన్నడు.
ఎంత గర్వం, ఎంత అహంకారం ఆయనకు.
క్యా చమత్కార్ కర్ దియా తెలంగాణ.. అని నాతోనే అన్నడు.
ఇంత పంట ఎలా పండింది అని అర్ధం చేసుకోలేక పోయిండు.
కేంద్రం సాధించలేని గమ్యాలను తెలంగాణ సాధిస్తే, అర్ధం చేసుకోవడం లేదు.
తెలంగాణలో ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాల వరి పంట సాగవుతున్నది.
దేశంలో ఎక్కడా ఇందులో సగం కూడా సాగు చేయడం లేదు
ఏ రాష్ట్రానికి రాని సమస్య, తెలంగాణకు ఎందుకు వస్తుందంటరు.
అవును వస్తది. ఎందుకంటే ఏ రాష్ట్రం వేయనంత విస్తీర్ణంలో మేం సాగు చేస్తున్నం.
ఎగుమతుల విషయంలో కూడా కేంద్రమంత్రి అబద్దాలు చెప్పిండు.
ఎండాకాలంలో వరిపంట వస్తది కాబట్టి, నూకల శాతం పెరుగుతది. అసలు కథ ఇదే.
వానాకాలంలో 100 కిలోల వడ్లు పడితే 65 కిలోల బియ్యం వస్తది.
యాసంగిలో మాత్రం ఎండాకాలం కాబట్టి తక్కువ బియ్యం వస్తయి. ఈ నష్టం కేంద్రం భరించాలె.
ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ పంటను తీసుకొని, దాన్ని వితరణ చేసే సందర్భంలో నష్టం వస్తే భరించాలె.
కొన్నిసార్లు ఎగుమతి చేస్తే లాభం కూడా వస్తది మరి.
కేంద్రంలో ఉన్నది తెలివితక్కువ ప్రభుత్వం.
కేంద్రం పన్నులు, రాష్ట్రం పన్నులు వేర్వేరుగా ఉంటాయి.
తెలంగాణ వచ్చినప్పటినుంచి పెట్రోల్, డీజిల్ పై మేం వ్యాట్ పెంచలేదు. (స్టేట్ ట్యాక్స్)
కేంద్రం మాత్రం రోజుకో రూపాయి పెంచుకుంటూ పోతుంది.
స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని మళ్లీ మనల్నే అంటున్నది.
ఫెడరల్ సమాఖ్యకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్నది.
ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాల్లో అధికారాల బదిలీ జరుపుతారు.
కానీ ఇక్కడ బలహీనమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నారు.
మీరే పెంచుతారు, మేం తగ్గించాలా? ఇదెక్కడి నీతి?
ఆహార భద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకుంటున్నది.
నూకలు ఎక్కువగా వస్తే ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తే సరిపోతుంది కదా..
కేంద్రానికి ఎందుకీ రాద్ధాంతం.
నిన్న ఢిల్లీలో కూడా భారత ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసినం. దోషిగా నిలబెట్టినం.
నేను సూటిగా అడిగిన. ఒక రాష్ట్రంలో చిన్న విషయం ఇది. ధాన్యం కొనుగోలు నష్టాన్ని భరించేందుకు కేంద్రానికి శక్తి లేదా? ప్రధాన మంత్రి మోదీకి మనస్సు లేదా? అని అడిగిన.
బ్యాంకులను ముంచిన కార్పొరేట్ గద్దల వెనుక ఉన్నది వీళ్లు కాదా..
లండన్లో తిరుగుతున్నది వీళ్ల ఫ్రెండ్స్ కాదా?
పదిన్నర లక్షల కోట్లు మాఫీ చేసింది.
కేంద్రం ఆదానీ గ్రూపుకు 12,500 కోట్లు మాఫీ చేసిండ్లు. పేపర్ల వచ్చింది.
రైతుల కోసం నష్టం భరించమంటే మాత్రం చేతగాదు.
బియ్యాన్ని రీ సైక్లింగు చేస్తున్నదని ఒక కేంద్రమంత్రి నీచంగా మాట్లాడుతడా?
రైతుల పట్ల, ప్రజల పట్ల కేంద్రం బాధ్యతారహితంగా ఉన్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం.
కేంద్రం ధాన్యం కొనకపోతే, దాన్ని మేం భరిస్తం.
ఈరోజు క్యాబినెట్లో ఈ విషయాన్ని సమగ్రంగా చర్చించినం.
మేం రైతులను కోరిన మీదట 20 లక్షల ఎకరాలలో వరిపంట తగ్గించగలిగినం.
అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రమే కొంటదని దుష్ప్రచారం చేసి, నమ్మించిండ్లు.
మేం ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించినం.
12 వేల కోట్లు ఉచిత కరంటు
10 వేల కోట్లు రైతు బంధు
1600 కోట్లు రైతు బీమా
మా రైతులకు నష్టం జరిగితే మేం చూస్తూ ఊరుకుంటమా.
మా రైతుల నష్టాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తది.
ఈ యాసంగిలో పండిన వరి పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని క్యాబినెట్ నిర్ణయించింది.
తక్కువ నష్టంతో ధాన్యం కొనేందుకు నలుగురు కార్యదర్శులతో కమిటీని వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
1960 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
రైతులెవరూ ఒక్క రూపాయి తక్కువకు కూడా ధాన్యం అమ్మవద్దని కోరుతున్నా.
వారం రోజులు ఢిల్లీలో ఉన్న. భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తున్నది.
కేంద్రం ఇపుడున్న బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది.
జీడీపీ తగ్గింది. నిరుద్యోగం పెరిగింది. నిత్యావసరాల ధరలు పెంచుతున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారం నిషా తలకెక్కింది.
మత గజ్జికి సంబంధించి చిల్లర పద్ధతుల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నది.
శ్రీరామ నవమి రోజున కూడా ఇలాగే జరిగింది.
ఎన్నికలు జరిగే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో రాళ్లు వేస్తరు.
మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇలా జరగలేదు.
దేశాన్ని బ్రష్టు పట్టించే పనులు చేస్తున్నది.
బెంగుళూరు సిలికాన్ వ్యాలీలా తయారైంది.
30 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నరు. మరో 30 లక్షల మంది పరోక్షంగా బతుకుతరు.
ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటరు.
దేశం చిన్నాభిన్నం అయితే, నిరుద్యోగులందరినీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోషిస్తదా?
మత విద్వేషాలతో దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు.
ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకొని పోతే, దేశం 100 ఏళ్లు వెనక్కి పోతది.
దేశ ప్రజలు ఈ ఉన్మాదుల కుటిల యత్నాలను అర్ధం చేసుకొని, తిప్పికొట్టాలి.
బుద్ధిజీవులైన భారత ప్రజలు తప్పక తిప్పికొడతారు.
ఇష్టం వచ్చినట్లు నడిపించలేరు. హిట్లర్లు, ముస్సోలినీలే పోయిండ్లు మీరెంత?
కేంద్రంపై పోరాటంలో నేను ముందుంట. అందరినీ ఒకటి చేస్త.
దేశ రైతాంగానికి దిక్కూ, దివాణం లేరనుకోకండి. జాగ్రత్త.
భారత దేశంలో రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ నిస్తూ, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రావాల్సిన అవసరం ఉన్నది.
త్వరలోనే హైదరాబాదులో ఈ పాలసీని తయారు చేస్తం.
కేంద్రం ఈ పాలసీని అడాప్ట్ చేసుకుంటే సరి.
లేదంటే, కేంద్రంలో ఇలాంటి పాలసీని తెచ్చే ప్రభుత్వాన్నే తెచ్చుకుంటం.-
-సీఎం కెసిఆర్