thesakshi.com : వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత ఆమెకు మేస్త్రీతో పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. విహారయాత్రలకు వెళ్లి లాడ్జ్ లో రూమ్ లు తీసుకుని జల్సా చేశారు.
విహారయాత్రకు వెళ్లిన ఇద్దరూ రెండు రోజుల పాటు ఆ సిటీలోనే ఉన్నారు. తరువాత ఇద్దరూ వేరే ఊరికి విహారయాత్రకు బయలుదేరారు. మార్గం మద్యలో పట్టపగలు పక్కనే నడుచుకుంటూ ఆ ప్రాంతాలు చూస్తూ వెలుతున్న ప్రియురాలి మీద ఆమెప్రియుడు కొడవలి తీసుకుని నరికేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆంటీ మీద ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగలలో ప్రభా (42) అనే మహిళ నివాసం ఉంటున్నది. పాపన్న అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ప్రభా నాగమంగలలోనే ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం ప్రభా భర్త పాపన్న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి సంవత్సరం పాటు ప్రభా ఒంటరిగా నాగమంగలలోనే ఉంది.
బెంగళూరులోని గోల్లరహట్టిలో నివాసం ఉంటున్న మేస్త్రీ బసవరాజ్ ప్రభా ఆంటీకి పరిచయం అయ్యాడు. కొంతకాలం అప్పుడప్పుడు కలుస్తున్న ప్రభా, బసవరాజ్ తరువాత అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. పలు ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లిన బసవరాజ్, ప్రభా ఆ ప్రాంతాల్లో లాడ్జ్ లో రూమ్ లు తీసుకుని జల్సా చేశారు.
మూడు రోజుల క్రితం బసవరాజ్, ప్రభా ఆంటీ మైసూరు సిటీకి వెళ్లి అక్కడ లాడ్జ్ లో రూమ్ తీసుకున్నారు. మైసూరు నగరంతో పాటు మలేమహేశ్వర బెట్ట (కొండ)పరిసర ప్రాంతాల్లో సంచరించిన బసవరాజ్, ప్రభా రెండు రోజులు రాత్రి మైసూరులోని లాడ్జ్ లోనే ఉన్నారు.ఇంకా ఒక్కరోజు ఇక్కడే ఉందామని బసవరాజ్ చెప్పినా అతని ప్రియురాలు ప్రభా అంగీకరించలేదని తెలిసింది.
ఉదయం మైసూరు నుంచి బయలుదేరిన తరువాత సూళకెరె పరిసర ప్రాంతాల్లోకి బసవరాజ్, ప్రభా విహారయాత్రకు బయలుదేరారు. మార్గం మద్యలో సూళకెరె సమీపంలో పట్టపగలు పక్కనే నడుచుకుంటూ ఆ ప్రాంతాలు చూస్తూ వెలుతున్న ప్రభా ఆంటీ మీద ఆమె ప్రియుడు బసవరాజ్ కొడవలి తీసుకుని నరికేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ప్రభా ఆంటీ మీద ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో అటువైపు స్థానికులు కొందరు వస్తున్న విషయం గమనించిన బసవరాజ్ అక్కడి నుంచి పరారైనాడు. తీవ్రగాయాలైన ప్రభాను ఆసుపత్రికి తరలించారు. ప్రభా మరో వ్యక్తితో చనువుగా ఉందని కోపంతో బసవరాజ్ ఆమెను చంపేయాలని అనుకున్నాడని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.