thesakshi.com : తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే.. వైసీపీ తరఫున గెలిచి… అదే పార్టీ పరువును.. తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ను రోడ్డుకు లాగడమే కదా!! అచ్చు ఇలాంటి పనే చేస్తున్నారు.. ఘనత వహించిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు. అటు తిరిగి ఇటు తిరిగి.. చివరకు వైసీపీ పంచన చేరిన రఘురామరాజు.. కాళ్లా వేళ్లాబడి జగన్ దగ్గర టికెట్ సంపాయించుకున్నా రని.. వైసీపీ సీనియర్లు చెబుతారు. ఇలా టికెట్ దక్కించుకున్న ఆయన జగన్ హవాతోనే గెలిచారని కూడా అంటారు. మరి.. ఇంతగా రాజుగారికి మేలు చేసిన పార్టీకి ఆయన ఏం చేస్తున్నారు? అంటే.. సున్నం పూస్తున్నారని.. అంటున్నారు వైసీపీ నాయకులు.
ఏమాత్రం కృతజ్ఞత లేకుండా.. తనను గెలిపించిన పార్టీని రోడ్డుకు ఈడుస్తున్నాడని.. చెబుతున్నారు. గడిచిన రెండేళ్లుగా నియోజకవర్గం జోలికి కూడా పోలేదు. గత ఏడాది కరోనా వంకతో.. ఢిల్లీలోనే తిష్టవేశాడని.. తర్వాత.. తనపై ఎవరో కేసులు పెట్టారంటూ.. తనకు ఓట్టేసిన ప్రజలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నాడు. అయితే.. నిత్యం మాత్రం వైసీపీ ప్రత్యర్థి పక్షం టీడీపీకి ఆ పార్టీ అనుకూల మీడియాకు అందు బాటులో ఉండి.. జగన్పైనా.. పార్టీపైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ.. పబ్బం గడుపుకొంటున్నాడని వైసీపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు.
నిజానికి వైసీపీ వల్ల ఆయనకు ప్రయోజనం లేదని భావిస్తే.. ఆ పార్టీకి రాజీనామా చేసే స్వేచ్ఛ ఉంది. అదేసమయంలో ఎంపీ పదవిని సైతం వదులుకోవచ్చు. కానీ.. ఒక తరహా బ్లాక్ మెయిల్ విధానాన్ని అనుసరిస్తూ.. పార్టీని పార్టీ అధినేత జగన్ను కూడా రోడ్డుకు ఈడ్చేందుకు రాజు కంకణం కట్టుకున్నాడని .. వైసీపీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు.
టీడీపీ అనుకూల మీడియాకు నిత్యం ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెట్టి .. ఢిల్లీ గడప దాటి వచ్చేందుకు సైతం జంకుతున్న రాజు.. ఇప్పుడు జగన్పై సవాలు చేస్తున్నాడని.. కేసు కూడా వేశానని చెబుతున్నాడని.. నన్ను వైసీపీ బెదిరిస్తోందని అంటూనే.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ఏమేరకు `రాజునీతి`! అంటున్నారు.
నిజానికి పార్టీ సంగతి పక్కన పెడితే.. నరసాపురం నియోజకవర్గంలో ఎంపీ ఎక్కడ?! అనే బోర్డులు వెలిశాయి. అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హీమీలు కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చి.. నియోజకవర్గాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది. అయితే.. ఇవేవీ పట్టించుకోకుండా.. ఢిల్లీలో కూర్చుకని పోసుగోలు కబుర్లతో పబ్బం గడుపుతున్నాడని.. వైసీపీ సీనియర్లు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.
“ఆయనకు పార్టీ నచ్చకపోతే.. శుభ్రంగా వెళ్లిపోవచ్చు. టీడీపీలో ఇదే కదా జరుగుతోంది. అక్కడ చంద్రబా బు అంటే.. గిట్టని వారు బయటకు రావడం లేదా?.. ఈయన కూడా అలానే చేయొచ్చుకదా!?“.. అని అం టున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు.. వైసీపీపై విమర్శలు చేసే ముందు.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. గెలిచి నిరూపించుకుంటే మంచిది కదా? అని నరసాపురం నాయకులు సహా కొందరు మంత్రులు సైతం వ్యాఖ్యలు సంధిస్తున్నారు.
మరి ఇన్ని నీతులు.. చెబుతూ.. తాను సత్యవంతుడినని చెప్పుకొనే రాజు… ఈ మాత్రం సాహసం చేయలేరా? చేస్తే.. మట్టికొట్టుకుపోతానని భయమా? అని సోషల్ మీడియాలో సటైర్లు కూడా పేలుతున్నాయి. ఏదేమైనా.. అవకాశ వాదంగా మాట్లాడిన ఇలాంటి వారు ఈ దేశంలో ఏమయ్యారో.. రాజకీయాల్లో ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నారో.. తెలిసిందేనని అంటున్నారు వైసీపీ నాయకులు. మరి చూద్దాం.. ఇప్పటికైనా.. రాజు గారు నిర్ణయం ఎలా తీసుకుంటారో!!