thesakshi.com : వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ఉదయం బయటకు వెలితే రాత్రికే మళ్లీ ఇంటికి వెలుతున్నాడు. భార్య మాత్రం ప్రతిరోజూ ఇంట్లోనే ఉంటున్నది. నేను బయటకు వెళ్లిపోయిన తరువాత తన భార్య ఎవరితోనో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతోందని, బయట తిరుగుతోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. అయితే భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమె భర్తకు ఇంత వరకు చిక్కలేదని సమాచారం. ఇంట్లో భర్త ఉన్న సమయంలో అతని భార్య సైలెంట్ గానే ఉంటోందని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు. రానురాను భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త ఆమెతో గొడవపడుతున్నాడు.
మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త ఇదే విషయంలో అతని భార్యతో గొడవ పెట్టుకుని ఆమెను చితకబాదుతున్నాడు. రాత్రి భర్తను నైలాన్ తాడుతో నైస్ గా చంపేసిన భార్య అతని శవాన్ని బెడ్ రూమ్ లోని ఫ్యాన్ కు వేలాడదీసింది. నా భర్త మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని భార్య బంధువులు, పోలీసులను నమ్మించి కేసు నుంచి తప్పించుకోవాలని పక్కాస్కెచ్ వేసింది.
మహారాష్ట్రలోని పూణే సిటీలోని ఉత్తమనగర్ లో రమేష్ బిసె అలియాస్ రమేష్ (45), నందిని రమేష్ బిసె అలియాస్ నందిని (41) దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లి జరిగిన తరువాత నందిని, రమేష్ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది. వివాహం చేసుకున్న రమేష్, నందిని దంపతులు కొన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నారు.
వ్యాపారం చేస్తున్న రమేష్ ఉదయం బయటకు వెలితే రాత్రికే మళ్లీ ఇంటికి వెలుతున్నాడు. రమేష్ భార్య నందిని మాత్రం ప్రతిరోజూ ఇంట్లోనే ఉంటున్నది. నేను బయటకు వెళ్లిపోయిన తరువాత తన భార్య నందిని ఎవరితోనో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతోందని, బయట తిరుగుతోందని ఆమె భర్త రమేష్ కు అనుమానం మొదలైయ్యింది.
భర్త రమేష్ అనుకున్నట్లే అతని భార్య నందిని బయటకు వెళ్లి వస్తోందని తెలిసింది. అయితే భార్య నందిని ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమె భర్త రమేష్ కు ఇంత వరకు చిక్కలేదని సమాచారం. ఇంట్లో భర్త రమేష్ ఉన్న సమయంలో అతని భార్య నందిని చాలా సైలెంట్ గానే ఉంటోందని, ఫోన్లు కూడా ఎక్కవ మాట్లాడదని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు.
రానురాను భార్య నందిని మీద ఇంకా ఎక్కువ అనుమానం పెంచుకున్న ఆమె భర్త రమేష్ ఆమెతో గొడవపడుతున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న రమేష్ ఇదే విషయంలో అతని భార్య నందినితో గొడవ పెట్టుకుని ఆమెను చితకబాదుతున్నాడు. రాత్రి మద్యం మత్తులో గొడవ చేసి నిద్రపోతున్న భర్త రమేష్ ను నైలాన్ తాడుతో నైస్ గా చంపేసిన అతని భార్య నందిని అతని శవాన్ని బెడ్ రూమ్ లోని ఫ్యాన్ కు వేలాడదీసింది.
నా భర్త రమేష్ మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య నందిని అతని బంధువులను, పోలీసులను నమ్మించి కేసు నుంచి తప్పించుకోవాలని పక్కాస్కెచ్ వేసింది. అయితే పోలీసులు విచారణలో నందిని, రమేష్ దంపతుల మద్య ఎక్కువగా గొడవలు ఉన్నాయని, ఇదే విషయంలో ఆమె భర్తను హత్య చేసిందని వెలుగు చూసింది.