thesakshi.com : మంత్రిగా ఉండటం కంటే..జగన్ సైనికుడిగా ఉండటమే తనకు ఇష్టమని చెప్పారు.మూడేళ్ల నుంచి కార్యకర్తలతో సరిగ్గా కలిసే అవకాశం రాలేదని..ఇక, రేపటి నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటానని అనిల్ ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి ప్రతీ గడపకు వెళ్తానని వెల్లడించారు. నెల్లూరులో టీడీపీ కంచుకోటల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసామని చెప్పుకొచ్చారు. ఈ సభ తాను వైసీపీ కార్యకర్తలతో పెట్టుకున్న సభ అంటూ..ఆదివారం ట్రాఫిక్ ఉండదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసానని వివరించారు. తాను ఎవరికీ పోటీ కాదని..తనకు తానే పోటీ అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. 2024 లో జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమని..తాను మంత్రి అవ్వటమూ ఖాయమన్నారు. నెల్లూరు జిల్లాలో వర్గాలు లేవన్నారు. ఉన్నది ఒకటే వర్గమని..అది జగన్ వర్గమని వ్యాఖ్యానించారు. ఎవరైనా జగన్ బొమ్మతోనే గెలవాలని స్పష్టం చేసారు.
నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లు బహిర్గతంగా ఉన్న వర్గపోరుకు నాయకులు చెక్ పెట్టారు. నెల్లూరు నగరంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు. నెల్లూరు జిల్లాలో వర్గపోరు ఉందని అంటున్నారని.. ఇక్కడ ఉంది ఒక్కటే వర్గమని, అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం మాత్రమేనని తేల్చి చెప్పారు.
నెల్లూరులో వైసీపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఆదివారం రోజు మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్.. తమ బల నిరూపణ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ సభ నిర్వహించారు. అందులో హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఇక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బైక్ ర్యాలీ చేశారు. దీంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇద్దరు నేతల కార్యక్రమం కోసం వెయ్యి మందికి పైగా పోలీసులను కేటాయించారు.
నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో అనిల్ సభ జరిగింది. సభ బానే జరిగినా.. అనిల్ మాత్రం కామెంట్స్ చేశారు. తర్వాత కాకాణి తొలిసారిగా నెల్లూరు వచ్చారు. కావలి నుంచి ఆయన ర్యాలీ నెల్లూరుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆర్యవైశ్య నేతలు, వైసీపీ శ్రేణులు కాకాణికి స్వాగతం పలికారు. ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నెల్లూరు వైసీపీ కార్యాలయానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు.
అంతకుముందు, అమరావతి నుంచి కావలి విచ్చేసిన ఆయనకు పట్టణ శివార్లలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ కావలి పట్టణంలోకి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం నెల్లూరు పయనం అయ్యారు. ఇవాళే ఇద్దరు నేతలు పర్యటన ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ప్రసంగం చేయలేదు. అనిల్ మాత్రం జగన్ ఫోటోతోనే అంతా గెలవాలని.. తాను మళ్లీ మంత్రిని అవుతానని అగ్గిరాజేశారు.
అనిల్ కామెంట్లను హై కమాండ్ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇద్దరు నేతలు సంయమనంగా ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయినా అనిల్.. మాట్లాడటంపై కొంత అసహనంతో సీఎం జగన్ ఉండి ఉంటారు అనుకుంటున్నారు . అనిల్‌ను పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుంది.