THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

దేశ రాజకీయాల్నే కుదిపేసే కంటెంట్ తో!

thesakshiadmin by thesakshiadmin
October 16, 2021
in Latest, Movies
0
దేశ రాజకీయాల్నే కుదిపేసే కంటెంట్ తో!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దేశం గర్వించ దగ్గ దర్శకుడు శంకర్ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే గ్రాండ్ గా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా శంకర్ మార్క్ భారీతనం నిండిన సోషియో పొలిటికల్ చిత్రంగా ప్రచారమవుతోంది. మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటన్నది కథాంశం.. అంటూ ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ లీకులతో భారతీయుడు రేంజ్ లో సినిమా ఉండబోతుందని అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇంకా శంకర్ దీన్ని అడ్వాన్స్ డ్ వెర్షన్ లో అత్యుత్తమ సాంకేతికతతో చూపించనున్నారు. దేశ రాజకీయాల్నే కుదిపేసే కంటెంట్ తో తెరకెక్కించనున్నారని.. సినిమా స్థాయి మరో లెవల్లో ఉంటుందని ప్రచారం హోరెత్తిపోతోంది. దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారే అంశాలు ఉన్నాయని..శంకర్ అలాంటి కంటెంట్ నే టచ్ చేయబోతున్నారని జాతీయ మీడియాలో సైతం ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక కియారా అద్వాణి లైన్ లోకి వచ్చింది. నా పాత్ర గురించి ఇప్పట్లో రివీల్ చేయలేను. కానీ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అని క్లారిటీ వచ్చింది. ఇది వివాదాస్పద అంశాలతో తెరకెక్కుతుందని నేను అనుకోవడం లేదు. చక్కని సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది. బలమైన కథ..కథనాలతో సాగుతుంది. శంకర్ మార్క్ చిత్రమని కచ్చితంగా చెప్పగలను. శంకర్ తో పనిచేయడం బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది“ అని అన్నారు. ఇక కియారా నవంబర్ నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇంకా ఇందులో శ్రీకాంత్..సునీల్ ..అంజలి.. తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మొదటిసారి రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ మూవీ కోసం అన్నిరకాల శ్రద్ధ వహించేందుకు ఉపాసన సంసిద్ధమయ్యారని గుసగుసలు వినిపించాయి. ఆర్.సి 15కి ఉపాసన కొణిదెల గేమ్ ప్లానర్ గా ఉన్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్ మూవీ సెట్ అవ్వడం వెనక ఉపాసన మంత్రాంగం నడిచిందని కూడా కథనాలొచ్చాయి. రామ్ చరణ్ ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ఇప్పుడు సతీమణి ఉపాసన గట్టి పంతంతో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే శంకర్ సినిమా కోసం అన్నీ తానే అయ్యి సహకరిస్తున్నారట. శంకర్ సినిమా అంటే అసాధారణ బడ్జెట్లతో సావాసం.. పైగా భారీ కాన్వాసుతో సినిమా కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రం విజువల్ వండర్ గా నిలవాలంటే.. సజావుగా సినిమాని పూర్తి చేయడం కోసం ఉపాసన తన వంతు కొన్ని బాధ్యతలు తీసుకున్నారట.

శంకర్ సినిమాలు భారీ స్థాయిలో విజువల్ రిచ్ లొకేషన్లతో తెరకెక్కుతాయి. మేకప్ లు కాస్ట్యూమ్స్ సెట్లు వగైరా వగైరా అన్నీ భారీ ఖర్చులు తప్పదు. అవసరం మేర ఖర్చులు పెరుగుతాయి. అయితే వాటి నిర్వహణలో ను.. చరణ్ విషయాలలో సహాయం చేస్తానని ఉపాసన ఆర్సీ15 టీమ్ కి హామీ ఇచ్చారట. ఇక లాంచింగ్ వేడుకకు రణవీర్ కియరా లాంటి స్టార్లు విచ్చేశారు. నాయకానాయికలు సహా ఫోటోషూట్ల కోసం కోటికి పైగా ఖర్చయిందని ప్రతిదీ ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు చెర్రీ తరపున ఉపాసన అవసరమయ్యే జాగ్రత్తలు తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. భారతదేశంలో ఒక విజువల్ గ్రాండియర్ సినిమా కోసం ఈ సహాయం చాలా అవసరం. ప్రాజెక్ట్ సవ్యంగా పూర్తవ్వాలంటే చరణ్ కి అన్నివిధాలా సహకారం అవసరం అని ఉపాసన భావిస్తున్నారట.

Tags: #DIRECTOR SHANKAR#FILM NEWS#KIARA ADVANI#RAMCHARAN#TELUGU CINEMA#TOLLYWOOD#UPASANA
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info