thesakshi.com : అక్కినేని ట్యాగ్ తొలగిపోయిన తర్వాత సమంత స్వేచ్ఛగా విహరిస్తున్న సంగతి తెలిసిందే. `ఊ అంటావా మావ` పాటతో ఇండియా మొత్తాన్ని ఊపేసింది. దేశం మొత్తం ఫేమస్ అయింది. సరిగ్గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోన్న సమయంలో దొరికిన అరుదైన అవకాశం ఇది. దీంతో సమంత వేగాన్ని ఆపడం అసాధ్యమైంది.
పెళ్లైన కొత్తలో హబ్బీతో హాట్ ఫోజుల్లో మంటలు రేపిన బ్యూటీ కొన్నాళ్లకి వాటికి దూరమైంది. కాపురం సజావుగా సాగుతున్న రోజుల్లో సమంత సినిమాల విషయాలోనూ చాలా సెలక్టివ్ గానే వెళ్లింది. హాట్ ఫోటో షూట్లకు దూరమైంది. విడాకుల సమయంలో ఎంతో మనోవేదనికి గురైంది. ఇప్పుడు పూర్తిగా అన్ని రకాల టెన్షన్ నుంచి బయట పడింది.
జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టింది. కావాల్సిన విధంగా జీవితాన్ని మలుచుకుని ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ కొత్త ఫోటో షూట్ కి తెర తీసినట్లు కనిపిస్తుంది.` కాస్మోపోలిటన్’ కవర్ పేజీ కోసం అమ్మడు బికినీ దుస్తుల్లోకి దూరిపోయింది. మెడలో సన్నటి గోల్డ్ చైన్..చేతికి వాచ్ ..రింగ్ ధరించింది. ఎద అందాలు…థై అందాలతో యువతలో సలపరం పుట్టిస్తుంది. కెమారాకి వయ్యారంగా ఇచ్చిన కొన్ని ఫోజులిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
సమంత అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల సమంత ‘క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకల్లో మతిపొగేట్టే దుస్తులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆ ఫోటోలు యువత కళ్లలో తేలుతూనే ఉన్నాయి. ఆ ఘటన ఇంకా మరువకే ముందే మరోసారి మంటలు రేపుతుంది
ఇక సమంత నటిస్తోన్న `యశోద` సినిమా విషయానికి వస్తే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. హరి శంకర్-హరీష్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. తెలుగు..తమిళ్ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ఉన్ని ముకుందన్.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమంత నటిస్తోన్న మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `శాకుంతలం`. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గత కొన్నాళ్లగా గుణ శేఖర్ చరిత్ర నేపథ్యం గల చిత్రాలు తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `శాకుంతలం` కూడా ఆ కోవకే చెందింది. ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు.