thesakshi.com : పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసి పడేసింది వైసీపీ. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ స్థాయిలో పరాజయ భారాన్ని మూటగట్టుకుందో, అంతకు రెట్టింపు అవమానాన్ని పంచాయతీ ఎన్నికల్లో పొందింది. ఇప్పుడిక మిగిలింది ఒక్కటే. టీడీపీ పరాభవం, వైసీపీ క్లీన్ స్వీప్ పరిపూర్ణం అవ్వాలి. దానికి ఈరోజు ముగింపు పలకనుంది. ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొద్దిసేపటి కిందట మొదలైంది.
13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలో ఉన్న 151 మండలాల్లో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి పోలింగ్ మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు.
తుది దశలో 3299 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 554 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఇప్పుడు పోలింగ్ జరుగుతోంది. ఇవాళ్టితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పట్నుంచి, ఈరోజు వరకు చంద్రబాబు చేయని విమర్శ లేదు. పన్నని కుట్ర లేదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ, చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుంటూ ఎలాగోలా విఘాత్రం కల్గించాలని ప్రయత్నించారు. ప్రభుత్వంపై బురద జల్లుతూ సింపతీ కొట్టేయాలని చూశారు. కానీ చివరికి తన కుప్పంలోనే చిత్తుగా ఓడిపోయారు.
ఈ ఎన్నికల ప్రక్రియతో రాష్ట్రంలో టీడీపీ పరువు పూర్తిగా పోవడంతో పాటు.. ఆ పార్టీ బలం ఏంటనే విషయం టీడీపీ శ్రేణులతో పాటు ప్రజానీకం మొత్తానికి తెలిసొచ్చింది. ఈరోజు రాత్రికి తుది ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ బాబు ఎప్పట్లానే “ప్రజాస్వామ్యం ఓడింది, నైతిక విజయం మాదే” అంటూ కబుర్లు చెప్పడం కామన్.