thesakshi.com : కళ్యాణదుర్గం మండలం మానిరేవు- కాలువపల్లి మధ్య వైస్సార్సీపీ నాయకుడు పల్లి శ్రీధర్ దారుణ హత్య..
హత్య చేసి గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీ కొన్నట్లు ప్రత్యర్థులు చిత్రీకరణ..
మృతుడు ఉరవకొండ మండలం షేక్షానుపల్లి సర్పంచ్ లింగన్న కుమారుడు
ఇది హత్య నని కఠినంగా శిక్షించాలని కోరుతున్న కుటుంబసభ్యులు.
వైస్సార్సీపీ నేత షేక్షానుపల్లి శ్రీధర్ హత్య దారుణం..
నిందితులు ఎంత వారైనా శిక్ష తప్పదు
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
“కళ్యాణదుర్గం మండలం మానిరేవు వద్ద హత్యకు గురైన వైస్సార్సీపీ నాయకులు శ్రీధర్ మృతదేహాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, వైస్సార్సీపీ నేతలు…”
మండలం లోని షేక్షానుపల్లి గ్రామానికి చెందిన పల్లి శ్రీధర్ ను ప్రత్యర్ధులు హత్య చేయడం దారుణమని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు.కళ్యాణదుర్గం మండలం మానిరేవు వద్ద హత్యకు గురైన వైస్సార్సీపీ నాయకులు శ్రీధర్ మృతదేహాన్ని సోమవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సందర్శించారు.హత్య వివరాలను పోలీసుల అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీధర్ తండ్రి లింగన్నను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీధర్ హత్యను తీవ్రంగా ఖండించారు. కక్షలు ఉబడకూడదని గ్రామానికి దూరంగా ప్రశాంత జీవితం గడుపుతున్న వ్యక్తిని ఈ విదంగా హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ హత్య చేసిన వారిని ఎవరైనా ఎంతటి వారైనా సరే వదిలేది లేదని తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు.విశ్వేశ్వరరెడ్డి వెంట వైస్సార్సీపీ నాయకులు వీరన్న, కౌడికి గోవిందు, తేజోనాత్, అశోక్ కుమార్, దుద్దేకుంట రామాంజనేయులు, తిప్పయ్య, సుశీలమ్మ, రమేష్, మచ్చన్న, పాలడుగు వంశీ, ప్రభాకర్,
నాగభూషన్, వన్నప్ప తదితరులు ఉన్నారు.