THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

లోకేష్ తో భేటీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె..!

thesakshiadmin by thesakshiadmin
May 28, 2022
in Latest, Politics, Slider
0
లోకేష్ తో భేటీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె..!
0
SHARES
67
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :    నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి  షాక్ తగిలింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

గతంలో అంటే 1985లో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రాపూరు అసెంబ్లీ నుంచి గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి రాపూరు నుంచే 1999 2004ల్లో రెండుసార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి కొణిజేటి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక ఆయన తెలుగుదేశంలో చేరారు. మళ్లీ 2018లో వైఎస్సార్సీపీలో చేరి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో రాపూరు నియోజకవర్గం పునర్విభజనలో రద్దు కావడంతో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి నారా లోకేష్ తో భేటీ కావడంతో ఆమె టీడీపీలో చేరతారని తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చే నెలల జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఒకవేళ టీడీపీ ఉప ఎన్నికలో పోటీ చేయకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అందులోనూ గతంలో అంటే 2009లో కైవల్యా రెడ్డి తండ్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దీంతో ఆత్మకూరులో కూడా ఆనం కుటుంబానికి పట్టు ఉంది. పెద్ద ఎత్తున అనుచరులు బలగం ఉంది. దీంతో కైవల్యా రెడ్డి ఆత్మకూరు సీటుపై కన్నేశారని సమాచారం. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్టు ఉన్నారు. ఆ పార్టీలో పెద్దగా ఆయన మాటకు విలువ లేదనే బాధలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను ఆనం రామనారాయణరెడ్డే టీడీపీలో చేర్చుతున్నారని సమాచారం.

ప్రస్తుతం మేకపాటి గౌతమ్ మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు లో బైపోల్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ నుంచి ఆనం కుమార్తె కైవల్యారెడ్డి బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. ఆనం..మేకపాటి కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచీ జిల్లాలో వర్గ పోరు ఉంది. దీని పైన ఆనం స్పందించారు. ప్రస్తుతం కైవల్యా బద్వేలు బిజివేముల కుమార్తె అని… లోకేష్ ను కలిస్తే..ఆమెనే అడగండి అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో..తాజా రాజకీయ పరిణామాలు నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Tags: #andhrapradesh politics#NaraLokesh#TDP#TeluguDesamParty
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info